హైదరాబాద్, జూలూ 19,
న్జూమర్లు పెద్ద పెద్ద మాల్స్‌కు వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడున్న షాప్‌లు, ఫుడ్ కోర్టులు, సినిమా హాల్సే. కానీ, కరోనా దెబ్బకు వీటి బిజినెస్‌లు దెబ్బతిన్నాయి. ఇంకా పుంజుకోకపోవడంతో ఈ ఏడాది కూడా రెంట్లను తగ్గించాలని మాల్స్ ఓనర్లను యాంకర్ టెనంట్లు (ఎక్కువ రెంట్ కట్టే వాళ్లు) కోరుతున్నాయి. మాల్స్ కూడా యాంకర్ టెనంట్లను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో రెంట్లను తగ్గిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020–21 లో యాంకర్ టెనంట్లకు రెంట్లలో రాయితీలిచ్చిన మాల్స్, ఈ ఏడాది రికవరీ బాట పడతాయని భావించాయి. కానీ, ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్ రావడం, త్వరలో థర్డ్ వేవ్ కూడా వస్తుందనే వార్తలొస్తుండడంతో రెంట్లను తగ్గించక తప్పదని ఎనలిస్టులు చెబుతున్నారు. మాల్స్‌కి జనాన్ని తెప్పించే వాటిలో సినిమా హాల్స్ ముఖ్యంగా ఉంటాయి. కరోనాకి ముందు మాల్స్‌కి వచ్చే కస్టమర్లలో సినిమాలు చూడడానికి వచ్చే వారి వాటా 30–40 శాతం వరకు ఉండేది. కానీ కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు ఓపెన్ కావడంలో రిస్ట్రిక్షన్లు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తగ్గాక సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, కేవలం 50 శాతం కెపాసిటీతోనే నడిచాయి. దీంతో మల్టిప్లెక్స్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉదాహరణకు అతిపెద్ద మల్టిప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ సేల్స్ కరోనా దెబ్బకు భారీగా పడ్డాయి. కంపెనీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో సినిమా టికెట్లను అమ్మడం వల్ల రూ. 1,731.15 కోట్ల రెవెన్యూ వచ్చింది. కరోనా వలన 2020–21 లో ఈ రెవెన్యూ రూ. 101.85 కోట్లకు తగ్గింది. ఫుడ్, సాఫ్ట్ డ్రింక్‌లను అమ్మడం వలన వచ్చే రెవెన్యూ రూ. 960.46 కోట్ల నుంచి రూ. 75.55 కోట్లకు తగ్గిపోయింది. కంపెనీకి వచ్చే యాడ్స్ ఇన్‌కమ్ కూడా పడిపోయింది. 2019–20 లో రూ. 375.88 యాడ్ రెవెన్యూ రాగా, 2020–21 లో రూ. 17.8 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చింది. పెద్ద పెద్ద మాల్స్‌కి పీవీఆర్ పెద్ద మొత్తంలో రెంట్ కడుతోంది. కానీ, కంపెనీ బిజినెస్ దెబ్బతినడంతో రెంట్లను తగ్గించాలని మాల్ ఓనర్లను డిమాండ్ చేస్తోంది. ఫీనిక్స్, డీఎల్‌ఎఫ్, నెక్సస్ వంటి పెద్ద మాల్స్ కూడా కిందటేడాది కంపెనీ కట్టే రెంట్‌ని పెద్ద మొత్తంలో తగ్గించాయి. కరోనాకు ముందు (2019–20 లో) రెంట్ల కోసం రూ. 577.42 కోట్లను కట్టిన పీవీఆర్, 2020–21 లో రూ. 119.87 కోట్లను మాత్రమే రెంట్‌గా కట్టింది. కామన్ ఏరియా మెయింటెనెన్స్ కోసం కట్టే రెంట్ రూ. 154.78 కోట్ల నుంచి రూ. 90.52 కోట్లకు తగ్గింది. ‘రెంట్స్, కామన్ ఏరియా మెయింటెనెన్స్‌లలో రాయితీ ఇవ్వాలని మాల్‌ఓనర్లతో చర్చలు జరుపుతున్నాము. ఈ ఏడాది మార్చి నాటికి తిరిగి బిజినెస్‌లన్నీ పుంజుకుంటాయని అనుకున్నాం. దురదృష్టవశాత్తు కరోనా సెకెండ్ వేవ్‌తో దేశంలోని మాల్స్, సినిమా హాల్స్, షాపింగ్ సెంటర్లన్ని మూతపడ్డాయి’ అని పీవీఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ అన్నారు. కేవలం సినిమా థియేటర్లే కాదు, ఇతర యాంకర్ టెనంట్ల పరిస్థితి కూడా పీవీఆర్ పరిస్థితిలానే ఉంది. కస్టమర్లను మాల్స్‌కి ఆకర్షించడంలో ఫుడ్ కోర్టులు ముందుంటాయి. కానీ, మొత్తం రెస్టారెంట్ ఇండస్ట్రీలో మార్పు కనిపిస్తోంది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్లకు హోమ్ డెలివరీ వలన రెవెన్యూ పెరుగుతోంది. ఉదాహరణకు బర్గర్ కింగ్‌కే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 38–43 శాతం సేల్స్ రెవెన్యూ హోమ్ డెలివరీల వలనే వచ్చింది. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నడుపుతున్న వెస్ట్‌లైఫ్ కు హోమ్ డెలివరీల సేల్స్ పెరిగాయి. గ్రోసరీ, క్లాత్స్, ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లు తమ ఆన్‌లైన్ ఛానెల్‌ను విస్తరించడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బిజినెస్ మోడల్స్‌ను మారుస్తూనే రెంట్లపై రాయితీ పొందుతున్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ 2020–21 లో రెంట్లపై రూ. 343.72 కోట్లను సేవ్ చేయగలిగింది. కంపెనీ రెంట్ల ఖర్చు రూ. 487.02 కోట్ల నుంచి రూ. 10.67 కోట్లకు తగ్గింది. బిజినెస్ లేకపోవడంతో పూర్తి రెంట్‌ను కట్టలేమని యాంకర్ టెనంట్లు మాల్ ఓనర్లకు చెప్పేస్తున్నాయి. మాల్స్ కూడా తమ యాంకర్ టెనంట్లను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో, రెంట్లను తగ్గించడానికి ఒప్పుకుంటున్నాయి. మరోవైపు ఇతర సెగ్మెంట్లకు చెందిన క్లయింట్లను ఆకర్షించాలని చూస్తున్నాయి. ‘కొత్త విధానాలకు అలవాటు పడాల్సిన టైమ్ వచ్చిందని తెలుస్తోంది’ అని నెక్సల్ మాల్ పేర్కొంది. హెల్త్‌కేర్, ఎడ్యుటెక్ వంటి సెక్టార్లలోని కంపెనీలను ఆకర్షించాలని మాల్స్ చూస్తున్నాయి.