YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మాణిక్ రాం ఠాగూర్ సీరియస్

మాణిక్ రాం ఠాగూర్ సీరియస్

మాణిక్ రాం ఠాగూర్ సీరియస్
హైదరాబాద్, జూలై 19, 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్టుపై మండిపడ్డారు తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతామని ఠాగూర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరు హిట్లర్‌ను తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ ప్రజాస్వామ్య సూత్రాలు పాటిస్తున్నారని ప్రశ్నించారు.కోకాపేట భూములను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు రేవంత్, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రేవంత్ సైతం మండిపడ్డారు. తనను లోక్ సభకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని సీరియస్ అయ్యారు.

Related Posts