నెల్లూరులో ప్లాస్టిక్ గుడ్ల కలకలం
నెల్లూరు, జూలై 19,
య్యం, నూనె, పాలు.. ఇలా ఎన్నో వస్తువులను కల్తీ చేయడం చూశాం గానీ కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి కోడిగుడ్లు కూడా కల్తీవి తయారుచేస్తున్నారు. కడప జిల్లాలో గర్భిణులకు, చిన్నారులకు కల్తీ బియ్యం పంపిణీ చేసిన ఘటన మరువక ముందేనెల్లూరు జిల్లాలో కల్తీ కోడిగుడ్లు ఘటన కలకలం రేపుతున్నాయి.నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రవారిపల్లిలో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం రేపాయి. పామూరు నుంచి ఆటోలో తెచ్చిన కోడిగుడ్లను కొందరు వ్యక్తులు గ్రామంలో విక్రయించారు. ఒక అట్ట రూ.100 అని ప్రకటించడంతో తక్కువ ధరకే వస్తున్నాయన్న ఆశతో గ్రామస్థులు భారీగా కొనుగోలు చేశారు. అయితే ఉడకబెట్టిన తర్వాత గుడ్లు నల్లగా మారడంతో వారంతా అవాక్కయ్యారు. కొన్ని గుడ్లను నేలకేసి కొట్టగా అవి పగలకుండా బంతిలా పైకి ఎగిరాయి.ప్రస్తుతం మార్కెట్లో రిటైల్ కోడిగుడ్డ ధర రూ.6లు పలుకుతోంది. అట్టకు 30 గుడ్లు చొప్పున వస్తాయి. అంటే ప్రస్తుతం ఒక అట్ట కోడిగుట్ల ధర రూ.180 వరకు ఉంది. అలాంటిది ఆటోలో వచ్చిన వ్యక్తులు అట్ట రూ.100లకే ఇస్తామని చెప్పగా అంత తక్కువకు ఎలా ఇస్తారని ప్రజలు కనీసం ఆలోచన కూడా చేయకుండా కొనుగోలు చేశారు.