చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేయనని తేల్చి చెప్పేసారు. మంగళవారం అమరావతిలో చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పారు. ప్రాధాన్యం, పదవులు ఇవ్వడం లేదని అలక చెదరని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.