YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

డిస్కౌంట్ల వలలో జ్యూయలరీస్

డిస్కౌంట్ల వలలో జ్యూయలరీస్

ముంబై, జూలూ 20, 
ధరలు బాగా పెరిగి బంగారానికి డిమాండ్‌‌ తగ్గడంతో జ్యూయలర్లు డిస్కౌంట్లకు తెరతీశారు. ఒక ఔన్సు బంగారంపై రూ.373 వరకు తగ్గిస్తున్నారు. గత వారంలో రూ.100 వరకు మాత్రమే డిస్కౌంట్‌‌ ఇచ్చారు. ట్రేడర్లు ఇలా బంగారంపై డిస్కౌంట్లు ఇవ్వడం ఈ నెలలో ఇదే మొదటిసారి. మనదేశంలో గోల్డ్‌‌పై 10.75 శాతం ఇంపోర్ట్‌‌ డ్యూటీ, మూడుశాతం జీఎస్టీ వేస్తారు. ఇండియా మార్కెట్లో గోల్డ్‌‌ ఫ్యూచర్లు రూ.48 వేల వద్ద ముగిశాయి. ఈ నెలలో ధర అత్యధికంగా రూ.48,389 వరకు రికార్డయింది. ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనేవాళ్లు తక్కువయ్యారు. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లోనూ గోల్డ్‌‌ ర్యాలీ చేసింది. వరుసగా నాలుగో వారం కూడా రేట్లు పెరిగాయి. డెల్టా వేరియస్‌‌ కేసులు పెరుగుతున్నాయనే భయం వల్ల చాలా దేశాలు మరోసారి లాక్‌‌డౌన్లు విధిస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌‌ బ్యాంక్‌‌ చీఫ్‌‌ చేసిన నెగటివ్‌‌ కామెంట్లు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లలో ఔన్స్‌‌ బంగారం ధర  18,15 డాలర్లకు చేరింది. ఎకానమీని గాడిన పెట్టడంలో భాగంగా వడ్డీరేట్లను మరింత తగ్గిస్తామని యూఎస్‌‌ ఫెడ్‌‌ చీఫ్‌‌ జెరోమీ పావెల్‌‌ ప్రకటించడంతో పసిడికి డిమాండ్‌‌ పెరిగింది. ఇన్‌‌ఫ్లేషన్‌‌ కూడా ఎక్కువ ఉందని ఆయన కామెంట్స్‌‌ బంగారానికి గిరాకీ పెరగడానికి కారణమయ్యాయి.ప్రస్తుతం డిమాండ్‌‌ లేక డిస్కౌంట్లు ఇస్తున్నప్పటికీ త్వరలోనే గిరాకీ పెరుగుతుందని గోల్డ్‌‌ ట్రేడర్లు చెబుతున్నారు. జనం గోల్డ్‌‌, డైమండ్స్‌‌, జెమ్‌‌స్టోన్స్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేయడం మళ్లీ మొదలుపెట్టారని అంటున్నారు. చాలా కంపెనీలు వెడ్డింగ్ రింగ్స్‌‌, జ్యూయలరీ, యానివర్శరీ, బర్త్‌‌డే గిఫ్టులను తయారు చేయడం మొదలుపెట్టాయి. లాక్‌‌డౌన్లు తొలగిపోయాయి కాబట్టి డిమాండ్‌‌ పుంజుకుంటుందని ఒక ట్రేడర్‌‌ చెప్పారు. వరల్డ్‌‌ గోల్డ్‌‌ కౌన్సిల్ డేటా ప్రకారం.. గత ఏడాది మార్చి క్వార్టర్‌‌తో పోలిస్తే ఈసారి మార్చి క్వార్టర్‌‌లో బంగారానికి డిమాండ్‌‌ 37 శాతం పెరిగింది. అయితే ఏప్రిల్‌‌లో సెకండ్‌‌ వేవ్‌‌ మొదలుకావడంతో సేల్స్‌‌ తగ్గాయి. సెప్టెంబరు నాటికి పరిస్థితి ఎప్పట్లాగే ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్‌‌ నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత నెల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేల మార్క్‌‌ను తాకింది. ఈ నెల ధర పడిపోయి రూ.47,850లకు చేరింది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ధరలు 18 శాతం పెరిగాయి.  కరోనాకు ముందు బంగారం సుమారు రూ.39,200 నుంచి రూ .41,750 వరకు పలికింది.

Related Posts