YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఎలక్ట్రిక్ వెహికల్స్ కు భారీగా డిమాండ్

ఎలక్ట్రిక్ వెహికల్స్ కు భారీగా డిమాండ్

హైదరాబాద్, జూలై 20, 
కరెంట్ బండ్లకు (ఎలక్ట్రిక్ వెహికల్– ఈవీ) డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ఈవీల వైపుకు మొగ్గుతున్నారు. ఖర్చు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుండడంతో వాటినే కొంటున్నారు. మూడేళ్ల కిందట రాష్ట్రంలో కేవలం 16 ఈవీలే ఉండగా.. ఇప్పుడవి 4,800కు చేరాయి. జనాలు కరెంట్ బండ్లపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఈ లెక్కలే చెప్తున్నాయి. వాటితో పాటు పెట్రోల్, డీజిల్తో నడిచే హైబ్రిడ్ ఈవీలూ బాగానే అమ్ముడవుతున్నాయి. ఇప్పటిదాకా ఈవీ, హైబ్రిడ్ ఈవీలు కలిపి 11 వేల దాకా రిజిస్టర్ అయ్యాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే అయ్యే ఖర్చు కేవలం 10 రూపాయలే కావడం, ఆ ఖర్చుతోనే ఎక్కువ దూరం వెళ్లే వెసులుబాటు ఉండడంతో జనం వాటివైపు చూస్తున్నారు. ఆటం, ఓమ్, గ్రావిటన్, రివోల్ట్ వంటి కంపెనీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.  స్పోర్ట్స్, స్కూటర్ మోడళ్లలో కరెంట్ బండ్లకు తయారీదారులు మరిన్ని ఫీచర్లు అద్దుతున్నారు. బ్యాటరీ లైఫ్, బ్యాకప్, చార్జింగ్ టైం, స్పీడ్ వంటి ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఫీచర్లను బట్టి ధరలను రూ.50 వేల నుంచి రూ.1.2 లక్షల దాకా పెడుతున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని డిజైన్ చేస్తున్నారు. స్పీడ్లోనూ రాజీ పడట్లేదు. గంటకు 25 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈవీలను రూపొందిస్తున్నారు. బైకులతో పాటు ఆటోలు, కార్లు ఇప్పుడు హైదరాబాద్లోనే తయారవడం ఇంకో ప్లస్ పాయింట్. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను కరెంట్ వెహికల్స్గా మార్చే స్టార్టప్ కంపెనీలూ పెరుగుతున్నాయి. అచ్చంగా ఈవీలనే తయారు చేస్తున్న కంపెనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి.  కార్ల సెగ్మెంట్లోనూ ఈవీలకు డిమాండ్ ఉంటోంది. ధరలే అందుబాటులో లేవు. పెద్ద కంపెనీలన్నీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో  పోలిస్తే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మామూలు కార్లతో పోలిస్తే మోడల్ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఈవీలపై రేట్లు ఎక్కువున్నాయి. దానికీ కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈవీ ఇంజన్లు తక్కువగా ఉన్నాయని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) ప్రతినిధులు చెప్తున్నారు. కార్లే కాకుండా వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారి కోసం ఈ–రిక్షాలూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి డోర్ స్టెప్ కాన్సెప్ట్ పేరుతో విజయ పాల ఉత్పత్తుల అమ్మకాల కోసం ఈ ఆటోలను తీసుకొచ్చారు. రెండు రిఫ్రిజిరేటర్లు సహా ఈ ఆటోధర రూ.లక్షన్నర దాకా ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంట్ బండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినట్టు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇప్పటిదాకా 11 వేల దాకా ఈవీలు రిజిస్టర్ అయ్యాయంటున్నారు. ఇప్పటికీ బండ్లు, కార్ల షోరూం వద్ద వెయిటింగ్ లిస్ట్ భారీగానే ఉంటోంది. బైకుల డెలివరీకి 45 రోజులదాకా పడుతోంది. ఎక్కువ చార్జింగ్ పాయింట్లు పెట్టి, ధరలు తగ్గిస్తే ఈవీలకు ఇంకా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తే మరిన్ని ఈవీలు అందుబాటులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు

Related Posts