కరీంనగర్, జూలై 20,
కరీంనగర్ జిల్లా వాసులకు వేగవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి రానున్నది. ఈ దిశగా రైల్వే శాఖ దృష్టిసారించింది. సరుకు రవాణాతో సమకూరే ఆదాయంతో కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పెద్దపల్లి నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే గూడ్స్ రైళ్లకు కరీంనగర్-నిజామాబాద్ లైన్ ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది. కొత్తపల్లి-మనోహరాబాద్‌లైన్‌తో సమీ ప భవిష్యత్‌లో కొత్తపల్లి జంక్షన్‌లో రైలు సర్వీసులు పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైన్‌లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నది.కరీంనగర్ నగర శివారులోని తీగలగుట్టపల్లెలో 20ఏండ్ల క్రితం రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. కరీంనగర్-పెద్దపల్లి, కరీంనగర్-నిజామాబాద్ మార్గంలో గూడ్స్, ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మొదట పుష్‌పుల్ మాత్రమే ఉండగా క్రమేణా తిరుపతి, తిరుపతి స్పెషల్, లోక్‌మాన్య తిలక్ టెర్మినల్(ఎల్‌టీటీ), కాచిగూడ రైళ్లు నడిచాయి. దీంతో పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్‌లైన్‌లో రైళ్ల రాకపోకలతో రద్దీ ఏర్పడింది. కరోనా కారణంగా గూడ్స్ రైళ్లు మాత్రమే నడువగా, కొద్ది రోజుల నుంచి కరీంనగర్-తిరుపతి సర్వీసు వారానికి రెండు సార్లు మాత్రమే వెళ్తున్నది.పెద్దపల్లి నుంచి కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు గూడ్స్ గంటకు 50 కిలోమీటర్లలోపు, ప్రయాణికుల రైళ్లు 70కిలోమీటర్ల లోపు వేగంతో నడిచేవి. నిజామాబాద్ వరకు 177 కిలోమీటర్ల ప్రయాణం గంటల తరబడి సాగేది. రాబోయే రోజుల్లో కరీంనగర్-పెద్దపల్లి, కరీంనగర్-నిజామాబాద్ రైల్వే మార్గం గూడ్స్, ప్రయాణికుల సర్వీసులకు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గంపై ప్రత్యే క దృష్టి పెట్టింది. ఈ మార్గంలో విద్యుద్ధీకరణ పనులు ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి. ఈ ట్రాక్ సామర్థ్యాన్ని పెంచింది. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేక రైలులో పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు ట్రాక్‌ను పరిశీలించారు. ట్రాక్ పరిస్థితి ఎలా ఉంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలతోపాటు సాంకేతికంగా అన్ని ప్రక్రియలను పూర్తి చేసి రైళ్ల వేగాన్ని పెంచే విషయమై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనుంది. కరీంనగర్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడిపించాలని ప్రజల నుంచి డి మాండ్ ఉంది. ప్రయాణ సమయం తగ్గితే ఈ మార్గంలో కొత్త సర్వీసులు వచ్చే అవకాశాలు ఉండనున్నాయి. పిల్లా పాపలతో ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, తొందరగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు