YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన అందోళన

జనసేన అందోళన

విజయవాడ
ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయి మెంట్ ఎక్చేంజి కార్యాలయం లో వినతి పత్రాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పలు ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు రోడ్డు ఎక్కారు.  దాంతో జిల్లాల్లో జనసేన నేతలను పోలీసులుముందస్తుగా  హౌస్ అరెస్టు చేసారు. పార్టీ కార్యకర్తల అరెస్టు లను  పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఖండించారు. విజయవాడలో ఎంప్లాయి మెంట్ ఎక్చేంజి కార్యాలయం వద్ద కు జనసేన నేత పోతిన మహేష్, ఇతర నాయకులు చేరుకున్నారు. అనుమతి లేదంటూ కార్యాలయం గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అధికారులే బయటకు రావడంతో వారికి  విజ్ఞాపన పత్రాన్ని అంద చేపారు.
మహేష్
పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2.30లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని  జగన్ చెప్పడం వాస్తవం కాదా. ప్రతి యేడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు జాబుకు లేని జాబ్ లెస్  క్యాలెండర్ ప్రకటించారు. ఇది అన్యాయం అంటే... అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అధికారులు కూడా వినతి పత్రాలు తీసుకోవాలంటే భయపడుతున్నారు. పోలీసులతో అన్యాయంగా మా వారిని అరెస్టు చేయిస్తున్నారు. పాదయాత్ర లో ముద్దులు కురిపించి...నేడు పోలీసులు తో కొట్టిస్తారా. ముప్పై లక్షల మంది జీవితాలను నాశనం చేస్తారా. నిన్న సిఎం నివాసం ముట్టడి తెలుసుకుని జగన్ పోలవరం పారిపోయారు. చంద్రబాబు చెప్పిన సోమవారం పోలవరం ను...జగన్  నిన్న అమలు చేసి చూపారని అన్నారు.

Related Posts