YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో తొలిసారిగా కొవిడ్‌ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ఇన్ఫెక్షన్‌ కేసు నమోదు

దేశంలో తొలిసారిగా కొవిడ్‌ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ఇన్ఫెక్షన్‌ కేసు నమోదు

న్యూఢిల్లీ జూలై 20
దేశంలో తొలిసారిగా కరోనా డబుల్‌ ఇన్ఫెక్షన్‌ కేసు నమోదైంది. అసోంలో ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ప్రయోగశాలలో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్‌ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని సైతం అధికారులు ధ్రువీకరించారు. అయితే, సదరు వైద్యురాలు ఇంతకు ముందే రెండో మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వేరియంట్ల బారినపడ్డారు. ‘వైద్యురాలికి ఒకే సారి రెండు వేర్వేరు వేరియంట్లు సోకిన కేసును గుర్తించాం. ఆమె రెండు మోతాదులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు’ తీసుకున్నారని అసోం దిబ్రూగఢ్‌ జిల్లా లాహోవాల్‌ ఐసీఎంఆర్‌ రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి అయిన బిశ్వాజ్యోతి బొర్కాకోటి చెప్పారు. ఇంతకు ముందు సదరు వైద్యురాలి మధ్య కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని పేర్కొన్నారు.‘‘ప్రయోగశాలలో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్‌ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించాం. ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్‌ సోకింది. డబుల్‌ వేరియంట్‌ను నిర్ధారించేందుకు రెండుసార్లు నమూనాలను సేకరించాం’ అని బిశ్వాజ్యోతి వివరించారు. అయితే, ఆమెకు తీవ్ర సమస్యలేవీ లేవని, స్వల్ప లక్షణాణలున్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతకు ముందు బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధ మహిళకు ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకాయి. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించగా.. గత మార్చిలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆ వృద్ధురాలు టీకా తీసుకోలేదని వైద్యులు తెలిపారు. అయితే, ఐసీఎంఆర్‌-ఆర్‌ఎంసీఆర్‌లో ఇప్పటి వరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు ఏవీ గుర్తించలేదని బిశ్వజ్యోతి స్పష్టం చేశారు.

Related Posts