YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

చిన్న వ్యాపారులకు చేయూతనిస్తున్నసోల్వ్ ఆన్‪లైన్ మార్కెట్

చిన్న వ్యాపారులకు చేయూతనిస్తున్నసోల్వ్ ఆన్‪లైన్ మార్కెట్

హైదరాబాద్ జూలై 20
ప్రపంచవ్యాప్తంగా సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నో అవాంతరాలని సృష్టించినదానిగా కొవిడ్-19 మహమ్మారి మానవజాతి ఎదుర్కొన్న అతి దారుణమైన సంక్షోభంగా చరిత్రలో గుర్తుండిపోతుంది. ఊహించని అత్యంత తీవ్రమైన పరిణామాలు కలిగించిన సంఘటనల్లో ఒకటిగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చాలా ప్రభుత్వాలు లాక్‪డౌన్ల వంటి వ్యూహాలని అమలు చేశాయి, ఫలితంగా వనరులు, ఆదాయం కూడా బాగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత సరఫరా గొలుసు నమూనాలు పూర్తిగా అంతరాయం కలిగింది, వాటి ఫరిణామాలు అన్ని పారిశ్రామిక రంగాల్లోనూ ప్రభావం చూపించేయి. దాదాపు అన్ని వస్తువుల సంపాదించే ధరలూ పెరిగిపోయేయి, లాజిస్టిక్ రంగం కూడా దెబ్బతింది, ఇటు వ్యాపారాలకి, అటు వినియోగదారులకి సంబంధించి వస్తువుల నిల్వ, రవాణా, సరఫరాలు ప్రభావితమయ్యాయి. ఎన్నో విడతల లాక్‪డౌన్‪లు, కార్యకలాపాల మీద మరెన్నో పరిమితులు విధించినప్పటికీ, తన ఖాతాదారులకి కావాల్సిన నిత్యావసరాల డిమాండ్ కి తగినట్టు వాటిని నిల్వచేసుకోడంలో, వారికి సరఫరా చేయడంలో కిరాణా దుకాణాలు మంచి ప్రతిభని కనబరిచేయి. డిజిటల్ కి మారడం, సాంకేతికని అమలు చేయడం, సరుకుల్ని సేకరించడంలో సోల్వ్ లాంటి ఇ-కామర్స్ మార్కెట్ స్థలాలతో కలిసి పనిచేయడం ద్వారా వాళ్ళు దీన్ని సాధించగలిగేరు. సోల్వ్ వంటి మార్కెట్‪ప్లేస్ ల్లో కొనుగోలుదారులుగా మారడం వల్ల, చిన్న వ్యాపారాలు ఎదుర్కొనే రకరకాల ఆపరేషనల్ సవాళ్ళని అధిగమించడానికి ఇది ఎన్నో పరిష్కారాల్ని అందించగలిగింది. ఈ కొవిడ్-19 కాలంలో, ముఖ్యంగా, సోల్వ్ వంటి డిజిటల్ మార్కెట్లు సరుకుల సరఫరాలు కొనుగోలుదారులకి చేరేలా దోహదం చేసేయి - కిరాణా దుకాణాలు కూడా వాటిలో వున్నాయి. నేల మీదుగా నడిచే రవాణా సదుపాయాల ద్వారా, స్థానిక నెట్వర్క్స్ ద్వారా, వీటిని సరైన సమయంలో చేరేలా చూసేయి. బై-నౌ-పే-లేటర్ (బిఎన్‪పిఎల్), ఇన్వాయిస్ ఫైనాన్సింగ్, వంటి పథకాల ద్వారా అవసరమైనచోట ఆర్థిక సహకారాన్నికూడా అందచేశాయి, ఈ కాలంలో నగదుకి సంబంధించిన సమస్యలని అధిగమించడానికి చేయూతనిచ్చేయి. సరఫరాల్లో ఏర్పడిన అవాతంరాల వల్ల వాస్తవానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారాల (ఎంఎస్ఎంఇ) రంగం బాగా దెబ్బతిన్నాది. మహ్మమారి ప్రభావాలని ఎదుర్కోడానికి ఎంఎస్ఎంఇలు పెద్దఎత్తున డిజిటైజేషన్ వైపుగా మారేయి, కొవిడ్-ప్రభావిత ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్లో మనుగడ సాగించడానికి ఆన్‪లైన్ లో ఉనికి కలిగివుండడం, ఇ-కామర్స్ కి మారడం అన్నది చాలా అవసరమని వారు గ్రహించేరు. డిజిటైజేషన్, సాంకేతికతని అందిపుచ్చుకుని అమలు చేయడాల్లో భారతీయ ఎంఎస్ఎంఇల ప్రయాణంలో ఇదొక కీలకమైన దశగా మారింది, సంక్షోభం వారిని ఈ దిశగా తోస్తే, పోటీతత్వంతో కూడిన ప్రపంచంలో ఇది వారి అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.

Related Posts