జూలై 20
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ మంగళవారం బీజేవైఎం కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తా వద్ద బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ప్రవీణ్ సింగ్ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు కుడుతూ, బూట్ పాలిష్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.. అనంతరం బీజెవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్ , ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆన్ని పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ తెరాస ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ముప్పై ఒక్క నెలల నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.లేని పక్షణ రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా నిరుద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేష్, ప్రధాన కార్యదర్శి లు చెట్లపెళ్లి సాగర్, ధామ శ్రవణ్, సీనియర్ నాయకులు గుండేటి సంజీవ్, సురుకుట్ల క్రాంతి, ఉపాధ్యక్షులు కంఠం శ్రీనివాస్, వోటారీకారి నవీన్, గొనేలా రాజశేఖర్,కాసుల వంశీ తదితరులు పాల్గొన్నారు.