YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కోవిడ్ చికిత్స కోసం బ్యాంకుల్లో రుణాలిస్తారా

కోవిడ్ చికిత్స కోసం బ్యాంకుల్లో రుణాలిస్తారా

నెల్లూరు
కోవిడ్ చికిత్స కోసం బ్యాంకుల నుంచి రుణాలను అందజేస్తారా?, ఎప్పటి వరకు అందజేస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  లోక్సభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 50 వేల కోట్ల రూపాయల్లో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత మొత్తాన్ని కేటాయించారని ప్రశ్నించారు. ఇందులో వ్యాక్సిన్ తయారీదారులకు ఎంత కేటాయించారు, మందుల దిగుమతికి, వ్యాక్సిన్ దిగుమతికి, వెంటిలేటర్స్ తదితర దిగుమతులకు ఎంత కేటాయించారని కూడా ప్రశ్నించారు.  ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ భగవత్ కరద రాతపూర్వకంగా ఆయనకు జవాబిచ్చారు. కోవిడ్ చికిత్స కోసం బ్యాంకులు తమ వనరుల నుంచి గానీ, రిజర్వ్ బ్యాంకుకు కేటాయించిన 50 వేల కోట్ల రూపాయల నిధులను చికిత్సకు గాను వచ్చే ఏడాది మార్చి వరకు రుణాలను అందజేస్తాయని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తయారీదారులకు, కోవిడ్ సంబంధిత మందుల దిగుమతిదారులకు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, లాబ్ లకు,  ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులకు ఈ నిధులను వినియోగిస్తారని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు బ్యాంకులు, కోవిడ్ రుణ ఖాతాలను తెరుస్తాయని తెలిపారు. ఈ మేరకు తమ వనరుల నుంచి పేషెంట్లకు ఈ ఏడాది జూలై 10వ తేదీ వరకు  2,887 కోట్ల రూపాయల రుణాలను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బ్యాంకులకు ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు రిజర్వు బ్యాంకు స్పెషల్ రివర్స్ రెపో ను పెంచే అవకాశం కలుగుతుందని తెలిపారు.

Related Posts