డోన్
నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని,విద్యార్థి యువజన సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటు అని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.35వేల ఉద్యోగలను భర్తీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్ డిమాండ్ చేశారు మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక గుత్తి రోడ్డు(అమ్మ హోటల్ సర్కిల్) నందు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి శేఖర్ అధ్యక్షత వహించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్ లు మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షం లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలో రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్ములిస్తామని నవరత్నాల పేరుతో పాదయాత్ర చేసి యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరలు అవుతున్న వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగలు భర్తీ చేయకుండా అరకొరగా వాలంటరీ పేరుతో సచివాలయం పేరుతో భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ అంటూ విడుదల చేయడం చాలా దుర్మార్గము అది జాబ్ క్యాలెండర్ కాదు బోగస్ క్యాలెండర్ అని వారు అభివర్ణించారు ఇది బోగస్ క్యాలెండర్ అనడానికి నిదర్శనంగా ఆర్ టి సి కార్మికులను, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగుల భర్తీ కూడా జాబ్ క్యాలెండర్ లోచేర్చాడమే ఒక నిదర్శనం అన్నారు అనేకమంది యువత చదువులు పూర్తి చేసుకొని, కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఉద్యోగలు ఇవ్వాలని ఖాళీలు భర్తీ చేయాలని శాంతి యుతంగా ముఖ్యమంత్రి కి విద్యార్థి యువకుల గోడు చెప్పుకోవాదానికి పోతే ఎక్కడికి అక్కడ పోలీస్ లతో అక్రమంగా అరెస్టు చేయుంచడం సిగ్గు చేటు అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే అక్రమంగా అరెస్టు చేసి విద్యార్థి, యువకులను విడుదల చేసి, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2.35 వేల ఉద్యోగలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో ని రాజకీయ పార్టీలను, విద్యార్థి, యువజన సంఘాలను, ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ ఐ యస్ ఎఫ్ జిల్లా నాయకులు, శివన్న, సీపీఐ, ఏఐటీయూసీ,ఏ ఐ యస్ ఎఫ్ నాయకులు పుల్లయ్య, అబ్బాస్, మద్దయ్య,తెలుగు విజయ్, శేఖర్, రాజేష్, విజయ్, రాఘవేంద్ర, మాబాష,మాబు తదితరులు పాల్గొన్నారు