YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే సహించం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే సహించం

న్యూఢిల్లీ, జూలై 20,   విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే సహించం -విశాఖ ఎంపీ  ఎం. వి. వి సత్యనారాయణ -లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శించి ఎత్తిన గళం...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే వ్యవహారం బహిర్గత అయినప్పటి నుంచి దానిని పలువిధాల అడ్డుకునే ప్రయత్నాల్ని విశాఖ ఎంపీ  ఎం. వి .వి. సత్యనారాయణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ,పలు కార్మిక సంఘాలు చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో స్వయానా ఆయన పాల్గొని తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచిన విషయము అవగతమే... ఈ నేపథ్యంలో లోక్ సభలో లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన గళాన్ని నేడు సభాపతికి వినిపించారు... ఇందులో భాగంగా విశాఖ ఎంపీ ఎం. వి .వి సత్యనారాయణ "వైజాగ్ స్టీల్ ప్లాంట్- నాట్ ఫర్ సేల్" అంటూ తనదైన గళాన్ని వినిపించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల ఆత్మార్పణ త్యాగ ఫలమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని, అటువంటి ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్ట దలచిన  కేంద్ర దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు... ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోలేని పక్షంలో పార్టీ ఆదేశాల మేరకు తాము ఎంతవరకైనా వెళ్లి , ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేసేంతవరకు కృషి చేస్తామన్నారు.  సభా కార్యక్రమాలు అడ్డుకున్న తరుణంలో  ,  స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్ సభ ను వాయిదా వేశారు...

Related Posts