YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్వయం సమృద్ధ దిశగా భారత్ భారీ నిర్ణయం

స్వయం సమృద్ధ దిశగా భారత్ భారీ నిర్ణయం

స్వయం సమృద్ధ దిశగా భారత్ భారీ నిర్ణయం
న్యూఢిల్లీ జూలై 20
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్వయం సమృద్ధ భారత్ దిశగా భారీ నిర్ణయం తీసుకుంది. ఆరు సంప్రదాయ జలాంతర్గాముల తయారీకి టెండర్లను జారీ చేసింది. భారత నావికా దళం కోసం ప్రాజెక్ట్-75 ఇండియా క్రింద ఈ జలాంతర్గాముల నిర్మాణానికి ఇండియన్ మజగావ్ డాక్‌యార్డ్స్ లిమిటెడ్, లార్సన్ అండ్ టూబ్రోలకు ఈ టెండర్లను జారీ చేసినట్లు సమాచారం .ఈ రెండు భారతీయ కంపెనీలు చెరొక విదేశీ భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, స్పెయిన్‌‌లకు చెందినవాటితో సహా ఐదు అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చర్ల నుంచి ఈ ఎంపిక జరగాలి. ఈ మెగా జలాంతర్గాముల ప్రాజెక్టు విలువ రూ.43,000 కోట్లు. చైనా నావికా దళానికి దీటుగా శక్తిసామర్థ్యాలను పెంచుకునేందుకు భారత నావికా దళం కృషి చేస్తోంది. ఈ జలాంతర్గాములు అందుబాటులోకి వస్తే భారత నావికా దళం మరింత బలోపేతమవుతుంది. భారత నావికా దళంలో జలాంతర్గాములను పెంచే లక్ష్యంతో స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ (ఎస్‌పీ) మోడల్‌‌ను అమలు చేస్తున్నారు. దీని క్రింద చేపడుతున్న వాటిలో రెండోది  ప్రాజెక్ట్ 75(ఐ). 2021 జూన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇది భారీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుల్లో ఒకటి అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చర్యల వల్ల భారత దేశంలో జలాంతర్గాముల నిర్మాణానికి అనుకూల వాతావరణం  ఏర్పడుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా సొంతం చేసుకోవడానికి దోహదపడుతుందని పేర్కొంది. దిగుమతులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని, క్రమంగా అత్యధిక స్వయం సమృద్ధి సాధించగలుగుతామని, స్వదేశీ వనరుల నుంచి వచ్చే సరఫరాలపై నమ్మకం బలపడుతుందని వివరించింది. ఇదిలావుండగా, భారత దేశం అమెరికా నావికా దళం నుంచి రెండు ఎంహెచ్-60ఆర్ సీహాక్ మారిటైమ్ హెలికాప్టర్లను, 10వ పీ-8 పొసియిడాన్ మారిటైమ్ సర్విలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సేకరించింది. అమెరికా నుంచి సుమారు 2.4 బిలియన్ డాలర్లతో 24 ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను సేకరించేందుకు కేంద్ర కేబినెట్  ఆమోదం తెలిపింది.

Related Posts