YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇంకా చేయాల్సింది...చాలా ఉంది

ఇంకా చేయాల్సింది...చాలా ఉంది

ఇంకా చేయాల్సింది...చాలా ఉంది
హైదరాబాద్, జూలై 20, 
ఐపీఎస్ అధికారి, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసేందుకే అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దీనిపై ప్రవీణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారుసూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించేది.. ఎంత నిజమో.. ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవడం‌ అంతే నిజమని అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని ఆయన అన్నారు. గత డెబ్బై, ఎనభై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అజెండాగా.. పూలే, అంబేడ్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు.సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో 1 శాతం మార్పు తీసుకొచ్చానని, ఇంకా 99 శాతం ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేస్తానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా గూడెం బిడ్డలు విదేశాల్లో చదివేలా ప్రోత్సహించానని, ఇలా అన్ని వర్గాల బిడ్డలు అభివృద్ధి చెందాలనేది తన ఆకాంక్ష అని ఆయన అన్నారు.

Related Posts