YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇంకా దొరకని రేప్ నిందితుల ఆచూకీ అంజనం వేస్తున్న పోలీసులు

ఇంకా దొరకని రేప్ నిందితుల ఆచూకీ అంజనం వేస్తున్న పోలీసులు

విజయవాడ, జూలై 21, 
గుంటూరు జిల్లా సీతానగరంలోని  కృష్ణానది పుష్కరఘాట్ లో  నెల రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు  తిరుగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు ఎంతగా ఉపయోగించినా పోలీసులకు దొరకకుండా  చక్కర్లు కొడుతున్నారు.  తాడేపల్లిలోని అన్ని అనుమానిత ప్రదేశాలలో జల్లెడ పట్టినా ఫలితం మాత్రం శూన్యం… ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగానే ఉంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల ఒత్తిడితో కింది స్ధాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు వెంకటరెడ్డి, కృష్ణ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ… పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నిందితులను మూడు రోజులలో పట్టుకుంటామంటూ… పోలీసులు సవాల్ విసిరారు. సవాల్ … సవాల్ గానే ఉండి పోయింది కానీ ప్రధాన అనుమానితుల జాడ కూడా కనిపెట్టలేక పోయారు తాడేపల్లి పోలీసులు.ఇప్పటికే పోలీసులు అనుమానిత ప్రాంతాలు జల్లెడ పట్టేశారు. అంతేకాకుండా సీతానగరం, తాడేపల్లిలో ఉన్న మనుషులు సంచరించని ప్రదేశాలను సైతం అడుగడుగునా వెతికారు. అయినా అనుమానితుల జాడ మాత్రం పసికట్టేకపోయారు.  అయితే అనుమానితులతో నిత్యం మద్యం సేవిస్తూ…ప్రతి విషయంలో వారికి అండ దండలను ఇస్తున్న తాడేపల్లిలోని కింది స్ధాయి సిబ్బందికి అనుమానితుల జాడ తెలిసే ఉంటుందని వెంకటరెడ్డి, కృష్ణల ప్రధాన సన్నిహితులు కొంతమంది అనుకుంటూ ఉండటం విశేషం. అయితే ఇప్పటికే గుంటూరు జిల్లా, విజయవాడ పోలీసులు సంయుక్తంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ ల కు చెందిన 250 మందిని పోలీసులు విచారించారు.అయినా నిందితుల ఆచూకీ దొరకలేదు.ఈ ఘటన జరిగి 30 రోజులు గడుస్తున్నా  కేసు నత్తనడకన సాగుతోంది. అనుమానితుల కోసం తాడేపల్లి, సీతానగరం బ్లేడ్ బ్యాచ్, గంజాయి సేవించే వారి లిస్ట్ తీసుకుని పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఆరు ప్రత్యేక పోలీస్ టీం లను ఏర్పాటు చేయడంతోపాటు క్రైం ఇన్వెస్టిగేషన్ లో అనుభవం ఉన్న పోలీస్ అధికారులతో మరో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.ఇదిలా ఉంటే పోలీసులు  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత ఉపయోగించినా ఫలితం లేకపోవడంతో   పోలీసులు మూఢనమ్మకాలపై ఆసక్తి చూస్తున్నారు.   ప్రధాన అనుమానితులలో ఒక వ్యక్తి పోలీసులను మూఢనమ్మకాల వైపు మళ్ళించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లి పోలీసులు గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ అంజనం వేసే వ్యక్తి వద్దకు వెళ్ళితే… సీతానగరం అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు కృష్ణ, వెంకటరెడ్డి జాడ తెలుస్తుంది అని వినుకొండ తీసుకువెళ్ళాడు.  అయితే అంజనం వేసే వ్యక్తి అప్పటికే చనిపోయాడని  స్ధానికులు పోలీసులకు చెప్పడంతో కంగుతిన్న పోలీసులు నిరుత్సాహంతో వెనుతిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషనుకు చేరుకునట్లు తెలుస్తోంది.అయితే ఆ అనుమానితుడు పోలీసులకు జాడ తెలిపేందుకు తీసుకువెళ్ళాడా… లేక తప్పు దొవపట్టిస్తున్నాడా…. అని స్టేషన్ కు వచ్చిన తరువాత అలోచిస్తుూ.. పోలీసులు  తలల పట్టుకున్నట్లు సమాచారం.  మరోవైపు ఈ కేసులో నిందితులకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లు లో హోంగార్డులకు మంచి సంబంధాలు ఉండటం వల్లన ఎప్పటికప్పుడు సమాచారం జారవేయడం వల్లన ప్రధాన అనుమానితులు తేలిగ్గా తప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా పోలీస్ ఉన్నతాధికారులు ఎంత ప్రత్యేక దృష్టి పెట్టినా…. స్టేషన్ సిబ్బంది సపోర్ట్ చేయలేక పోవడం వల్లనే ప్రధాన అనుమానితులను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే మరో పక్క పోలీసులు అనుమానితులు సెల్ ఫోన్ కాల్ లిస్ట్ అధారంగా రెండు సంవత్సరాల క్రితం ఎవరెవరితో మాట్లాడారు… అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.తాజాగా రెండు రోజు క్రితం తెలంగాణ భద్రాచలంకు రెండు ప్రత్యేక బృందాలు వెళ్ళి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకువచ్చి రెండు రోజులు విచారించినట్లు తెలుస్తోంది… అతని వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో తిరిగి పంపేసినట్లు సమాచారం.  మరోపక్క ప్రధాన అనుమానితుల సన్నిహితులు కఠారి గోపి, సురేష్, రాజేష్ అలియాస్ అరిటి పండు ఈ ముగ్గురిని పోలీసులు తనదైన శైలిలో విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు అనుమానితులు చెప్పిన విధంగా కేసు విచారణ ఏ మాత్రం ముందుకు సాగకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.ఇప్పటికీ గుంటూరు జిల్లా పోలీసులతో పాటు విజయవాడ కమీషనరేట్ పరిధిలో ఉన్న సీసీఎస్ పోలీసులు, ఐడి పార్టీ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఇద్దరు అనుమానితుల కోసం గాలించడంతో పాటు నిందితుల ఇళ్ళవద్ద ప్రత్యేకంగా ‌మఫ్టిలో ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ పరిసర ప్రాంతంలో గమనిస్తూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే సీయం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోనే మహిళలకు భద్రత లేదని అలాంటప్పుడు రాష్ట్రంలో ‌మహిళలకు భద్రత ఎక్కడ కల్పిస్తారని వివిధ రాజకీయ పార్టీలతో పాటు మహిళల సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికైనా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని‌ ప్రధాన అనుమానితులను పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠ ను కాపాడాల్సిన భాద్యత పోలీసుల పైన ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Related Posts