YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

త్వరలో ఓపెన్ బుక్ సిస్టమ్

త్వరలో ఓపెన్ బుక్ సిస్టమ్

హైదరాబాద్, జూలై 21, 
పుస్తకాలు చూసి పరీక్షలు రాయడమంటే ఇన్నాళ్లు నేరం. అందుకే అలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులను డీబార్ చేస్తుంటారు. కానీ, ఇకపై అలా కాదు. ఎంచక్కా పుస్తకాలు ముందు పెట్టుకొని ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో చూసి రాసుకోవచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్చ‌ల వ‌ర‌కే ఉన్న ఈ ప్ర‌తిపాద‌న ఈ సంవ‌త్స‌రం నుంచి కార్య‌రూపం దాల్చుతుంది. తెలంగాణ పాలిటెక్నీక్ కోర్సుల్లో ఈ ఏడాది నుండే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్ష‌ణ మండ‌లి(SBTET) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.నిజానికి చాలాకాలంగా ఈ ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహణపై కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి లాక్ డౌన్ తర్వాత విద్యావిధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కొత్త విధానంపై మరింత విస్తృత అధ్యయనం జరిపి ఇప్పుడు ఇలా ఈ విద్యాసంవత్సరం నుండే అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మధ్యనే కొన్ని యూనివర్శిటీలో ఈ ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అమలు చేయగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం దీనిని అమలు చేయనున్నారు.అయితే.. ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు అంటే అదేదో చాలా సింపుల్ గా ఉందని.. చూసి రాయడమే కదా అనుకోవచ్చు. కానీ.. ఓపెన్ బుక్ సిస్టంలో పరీక్ష తీరు కూడా మారుతుంది. ప్రశ్నాపత్రాల తయారీ కూడా వైవిధ్యంగా ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే స‌బ్జెక్టుపై ప‌ట్టు ఉంటేనే ఈ ప‌రీక్ష‌లు అయినా రాయగలిగేది. లేదంటే ప్రశ్నాపత్రంలో ప్రశ్న చూసి బుక్ లో దాని సమాధానం కోసం వెతకడం అనేది చాలా టైమ్ తీసుకుంటుంది. తద్వారా పరీక్ష సమయం సరిపోదు. ప్రశ్నాపత్రంలో ప్రశ్న ఇన్ డైరెక్ట్ విధానంలో ఉన్నా గుర్తించి సమాధానం రాసేలా సబ్జెక్టు మీద పట్టు ఉండాలి.

Related Posts