YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

త్యాగాలపండుగ... ఘనంగా బక్రీద్ సంబరాలు.

త్యాగాలపండుగ...   ఘనంగా బక్రీద్ సంబరాలు.

నందికొట్కూరు జూలై: 21
 నందికొట్కూరు నియోజకవర్గం లోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో లో ని మసీదులలో మసీదు. ఈమమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రవక్త గురించి ఈ సందర్భంగా త్యాగాల పండుగ బక్రీద్ ..బక్రీద్’ పండుగ అసలు పేరు- ‘ ఈదుల్ - అద్ హా’ అంటే – “త్యాగాల పండుగ  అన్నది. దీనికి రెండు నెలల ముందు వచ్చే మరొక పండుగ “రంజాన్” దీని అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్” అంటే- “దానాల పండుగ ప్రతీ వ్యక్తి ప్రవృత్తిలో “దాన గుణాన్ని” “త్యాగనిరతిని” పెంపొందించటానికి ఒక పండుగను “దానాల పండుగ అని.. మరొక పండుగను “త్యాగాల పండుగ  అని నిర్దేశించటం జరిగింది. .ఏమిటీ త్యాగాల పండుగ సంక్షిప్తంగా ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవ మార్గంలో చేసిన బలికి గుర్తు గా దైవ మార్గంలో ఒక గొర్రెనో, మేకనో,  లేక ఒంటెనో బలి ఇవ్వాల్సిందిగా నిర్దేశించటం జరిగింది. దానికి కారణం  ఆ బలి ఇవ్వగా వచ్చిన మాంసంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బీదలకు పంచాలి తద్వారా ఎందరో ఆకలితో అలమటించే బీదలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. మరొక భాగం బంధువులు దగ్గరవారు ఇరుగుపొరుగు వారికి దానం చేసి మిగిలిన ఒక భాగం స్వయంగా తినటం కోసం అన్న ఉద్దేశంతో మాత్రమే!
అసలు బలి ఇవ్వాల్సినవి ఏమిటి?
ధర్మంలో ప్రార్ధన, ఉపవాసం, జంతు బలి ఇవ్వటం వగైరా క్రతువులు ఏదో పుణ్యం కోసం యాంత్రికంగా చేసుకుపోవటానికి నిర్ధేశించినవి కావు. కానీ, వాటి నిర్వర్తించటం ద్వారా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించి.. మంచిపనులు చేసే ప్రవృత్తిని జనింపజేయటమే!ఇక బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక వ్యక్తి జంతు ‘బలి దానం’ ఇవ్వటం అన్న క్రతువుతో “ఖుర్బానీ (త్యాగం)” అన్న ప్రక్రియ పూర్తి అయిపోదు. నిజానికి ఒక వ్యక్తి చెయ్యవలసిన “ఖుర్బానీలు (త్యాగాలు)” ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో చదవగలరు.
“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (దైవ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు” - 3:96
అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యగలగాలి.అమితంగా ప్రేమించే వస్తువులను త్యాగం చెయ్యగలగాలి.అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాలను త్యాగం చెయ్యగలగాలి.ఈ విధంగా మనిషి అమితంగా ప్రేమించే పై వాటిని త్యాగం చెయ్యటంతో పాటు మనిషి..
ఇతరుల పట్ల ఉండే ఈర్ష్యా-ధ్వేషాలను బలి ఇవ్వాలి...
వదులుకోలేని బలహీనతలను బలి ఇవ్వాలి...
చెడు కోరికలను, చెడు ఆలోచనలను బలి ఇవ్వాలి...
కాబట్టి బక్రీద్ రోజు జంతు బలి ఇవ్వటం అన్నది ఒక కేవలం ప్రవక్త ఇబ్రహీం (అలై) బలికి ఒక 'గుర్తు గా నిర్వర్తించే క్రతువు అయినప్పటికీ..  దైవ మార్గంలో అమితంగా ప్రేమించే వాటిని అంటే- మనిషి అమితంగా ప్రేమించే ధనాన్ని, ఆహార పదార్థాలను, వస్తువులను త్యాగం చెయ్యగలగాలి.. దానితో పాటు ఈర్ష్యా-ధ్వేషాలను, బలహీనతలను, చెడు కోరికలను బలివ్వాలి. ఈ రకమైన త్యాగనిరతిని వ్యక్తిత్వంలో కలిగి ఉన్నప్పుడే ఖుర్బానీ ఇవ్వటం అన్న ప్రక్రియకు  సార్థకత చేకూరుతుంది.కాబట్టి దైవమార్గంలో ఇచ్చే జంతు బలి (ఖుర్బానీ) అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ…ముస్లిం సోదరులకు నెహ్రూ నగర్ మహమ్మదీయ మజీద్ ఇమామ్ హఫీజ్ అబ్దుల్  మన్నాన్. వివరించారు.

Related Posts