YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిరుద్యోగులను నిలువునా ముంచిన జగన్ రెడ్డిపైనే కేసులు పెట్టాలి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

నిరుద్యోగులను నిలువునా ముంచిన జగన్ రెడ్డిపైనే కేసులు పెట్టాలి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

అమరావతి
ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపిన విధ్యార్ధులు, నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్సీ మంతెనల సత్యనారాయణరాజు అన్నారు.  ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి చూపమంటే అక్రమ కేసులు పెడతారా? తాము అధికారంలోకి వస్తే  2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని   జగన్ చెప్పారు. ఆ ఇచ్చిన హామీనే నెరవేర్చమని నిరుద్యోగులు అడుగుతున్నారు తప్ప, వారేమైనా జగన్ ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని అడుగుతున్నారా? లేక ఆయన అక్రమంగా సంపాదించుకున్న రూ. 43 వేల కోట్ల ఆస్తులు కావాలని అడుగుతున్నారా?  వారు అడిగేది ఉద్యోగాలే కదా. మరి ఎందుకు వారిపై అక్రమ కేసులు? కేసులు పెట్టాల్సింది విధ్యార్దులు, నిరుద్యోగులపై కాదు, ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ పైనే కేసులు పెట్టాలని అయన అన్నారు.
ముఖ్యమంత్రికి తాడేపల్లి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూల్చటంపై ఉన్న శ్రద్ద ఉద్యోగాల భర్తీపై లేదు. ఉన్న ఖాళీలు భర్తీ చేయటానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి?  చెప్పిన హామీ నెరవేర్చమంటే చేతులకు సంకెళ్లేసిన ఘనత  జగన్ రెడ్డికే దక్కుతుంది. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారు పోరాటం ఆపుతారా? కష్టపడి చదువుకుంది ఉద్యోగాలు సాధించడానికా? లేక జైళ్లలో కూర్చోడానికా? ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొంది వచ్చారు,  నిరుద్యోగులను జగన్ రెడ్డి నిలువునా మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా  జగన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. రైతులు వర్షం కోసం ఎదురు చూసినట్టు  రాష్ర్టంలోని ఉన్న ప్రతి నిరుద్యోగి ఉద్యోగాల నోటిఫికేషన్  కోసం ఎదురు చూస్తున్నారు.   జగన్ రెడ్డి విడుదల చేసిన చేసిన జాబ్ క్యాలెండర్ ని వెనక్కి తీసుకుని 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి కొత్త క్యాలెండర్ విడుదల  చేయాలి.  నిరుద్యోగులు, విధ్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని అయన డిమాండ్ చేసారు.

Related Posts