YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర గెజిట్ గొడ్డలి పెట్టులాంటిది మైసూరా రెడ్డి

కేంద్ర గెజిట్ గొడ్డలి పెట్టులాంటిది మైసూరా రెడ్డి

కడప
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్  హంద్రీనివా, గాలేరు నగరి తెలుగు గంగ లాంటి రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలి పెట్టు లాంటిదని మాజీ మంత్రి మైసురా రెడ్డి అన్నారు.  గెజిట్ ను ఆహ్వానించే  ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ, గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డులను వేరు వేరుగా ఏర్పాటు చేశారు. నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశించి చట్ట బద్ధత కల్పించక పోతే అవి నిరర్థక  ఆస్తులగా మిగిలిపోతాయని మాజీ సీఎంకు, ప్రస్తుత సీఎం కు పలుమార్లు విజ్ఞప్తి చేసాం. కానీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలిస్తే మిగులుబాటు అయ్యే  కృష్ణ జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తూ జిఓ ఇవ్వాలని మాజీ సీఎం చంద్రబాబు ను జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఆ జిఓ ఇవ్వలేదు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని కేటాయించి చట్టబద్దత కల్పించే విషయంలో అప్పటి సీఎం, నేటి సీఎం ఇద్దరు విఫలమయ్యారని అయన విమర్శించారు.
పట్టి సీమా ప్రాజెక్టు ద్వారా ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టు లకు కేటాయించి ఉంటే ప్రాజెక్టులు ఆమోదం లేనివి అనే అపవాదు పొందేవి కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఇష్టం వచ్చినట్లు విద్యుత్ కేంద్రం నుండి నీటిని తోడి శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తుంటే ఆంధ్రా పాలకులు ఎమ్ చేస్తున్నారు..?  గతంలో గోదావరి నదీ జలాలపై వివాదాలను కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంమంత్రులు చర్చించుకుని పరిష్కారంచుకున్నారు. నేడు ఎందుకు రెండు రాష్ట్రాల సీఎం లు చర్చించుకోకుండా ఎందుకు మిన్నుకుంటున్నారు.?  నదీ జలాల అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్హించుకోకుండా రాజకీయ లబ్ది కోసం ఘర్షణ పడి తమ పిలకలను కేంద్రం చేతిలో పెట్టారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వం ఉండి ఉంటే రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగి ఉండేదా..? అని  అయన ప్రశ్నించారు.

Related Posts