కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడి పడిగాపులు కాసే వారని, అదే మోదీ పాలనలో రైతులకు విరివిగా ఎరువులు లభిస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.
గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కీసర మండలం బోగారంలో నిర్వహించిన కిసాన్ కళ్యాణ్ కార్‌్శాలలో పాల్గొన్న రైతులనుద్దేశించి డాక్టర్ లక్ష్మన్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుందని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా.. పంట నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించి ఆదుకుంటున్నారన్నారు.
పేద కుటుంబంలో పుట్టిన మోదీ.. తన తల్లి పడ్డ కష్టాలు చూసిన మోదీ..ప్రధాని అయిన తర్వాత దేశంలోని పేదరికాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. కట్టెల పొయ్యితో వంటచేస్తూ.. తన తల్లి కంట కన్నీరు చూసిన మోదీ.. పేద తల్లుల కంట కన్నీరు రాకూడదన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారన్నారు. ఉజ్వల పథకం ద్వారా తెలంగాణలోనూ 20 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసినట్లు డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోతుందని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకంలో భాగంగా జీరో బ్యాలెన్స్‌తో అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. జన్‌ధన్ పథకంలో భాగంగా 32 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారని, మోదీ పాలనలో దళారుల బెడద లేకుండా చేశారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి ఇంటింటికి 12 వేల రూపాయాలను ఇస్తున్నారని, అలాగే మరుగుదొడ్లు అనే పేరుకు బదులుగా వాటిని మహిళల ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేశారన్నారు. అలాగే ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో- బేటీ పడావో, ప్రధాని సురక్ష బీమా యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తూ.. పేదల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. సురక్ష బీమా యోజన కింద ఏడాదికి 12 రూపాయలు చెల్లిస్తే.. కుటుంబంలో అనుకోని ఘటన జరిగినప్పుడు కేంద్రం 2 లక్షలు, అలగే జీవన జ్యోతి పథకంలో భాగంగా మరో 2 లక్షలు కేంద్రం చెల్లిస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.
దళిత, యువతీ యువకులు పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మోదీ ప్రభుత్వం స్టాండప్ ఇండియా ద్వారా రుణాలు ఇస్తుందని డాక్‌ిర్ లక్ష్మన్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తున్నారని, తెలంగాణలో 4 వేలకు పైగా యువత పారిశ్రామిక వేత్తలుగా తయారయ్యారన్నారు.
మోదీ ప్రధాని అయ్యేనాటికి దేశంలోని 18 వేల గ్రామాల్లో విద్యుత్ వసతి కూడా లేదని, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 16 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు.
పేదల కోసం పనిచేస్తున్న ఏకైకప్రభుత్వం మోదీ ప్రభుత్వమని, పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద మోదీ ఇళ్లు కట్టిస్తున్నారని, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం ఇచ్చిన నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేయడం లేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వాగ్ధానాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్.. ఓట్ల కోసం మళ్లీ ఇప్పుడు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లిస్తామని మోసం చేసిన కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు గ్రామపంచాయతీకి 20 లక్షలు రూపాయాలు ఇస్తున్నారని, వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో దేశాన్ని 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేసిందని, అవినీతి, అక్రమాలతో పేదలను మరింత పేదలుగా, ధనికుల్ని మరింత ధనికులుగా మార్చిందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
ఒక పేదవాడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే ఓర్వలేని కాంగ్రెస్ చౌకబారు విమర్శలకు దిగడం సిగ్గుచేటని, కుటుంబ, వారసత్వ పాలనతో కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ బిజెపి విజయ బావుటా ఎగురవేస్తూ వస్తోందని, మోదీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు బిజెపి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలిచి, వచ్చే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.