YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

కేంద్ర మంత్రి మాండవియాతో రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ

 కేంద్ర మంత్రి మాండవియాతో రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సామావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్ రెడ్డి, రాములు, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి తదితరులు హజరయ్యారు.  మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వానకాలంతె కేంద్రం 10లక్షల 50 వేల యూరియా కేటాయింపు చేసింది. కేటాయించిన యూరియాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నెలవారీగా సరఫరా చేస్తారు. జూన్, జులై నెలల సరఫరా లో 93 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోటు సరఫరా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు గాను దాదాపుగా నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. లోటు సరఫరా ఉన్నదాన్ని కూడా కలిపి ఒకేసారి మొత్తం పంపించాలని విజ్ఞప్తి చేసాం. విదేశాల నుంచి త్వరగా వచ్చే యూరియా కోటాలో తెలంగాణకు కేటాయించాలని కోరామని అన్నారు. సీజనల్ గా దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా నాట్లు పడతాయి. సీజనల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా తెలంగాణకి యూరియా ఇవ్వాల్సిందిగా కోరాము. తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి మాన్సుఖ్ మండవియా అభినందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఇబ్బంది రానివ్వమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు.

Related Posts