కృష్ణమ్మ ఒడికి సంగమేశ్వరుడు
కర్నూలు
సప్తనదీ సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తోంది. ప్రపంచం లో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న లలితాసంగ మేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకోవ డంతో సంగమేశ్వ రునికి చివరి పూజ లు చేసి కృష్ణమ్మ కు మహమంగళ హరతిని అర్చకులు తెలకపల్లి రఘురా మశర్మ అందిం చారు. సంగమేశ్వరా లయం ఈ ఏడాది మార్చి 21వ తేదీ శ్రీశైల జలాశయం, కృష్ణా జలాల్లో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జులై 21వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించి.. వేపదారు శివలింగాన్ని తాకాయి. 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చాడు. మళ్ళీ స్వామి వారి దర్శనం కలగాలం టే 8 నెలలు వేచిఉండాల్సిందే.