YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 నిరాడంబరంగా ఈదుల్ అజ్హ బక్రీద్ వేడుకలు

 నిరాడంబరంగా ఈదుల్ అజ్హ బక్రీద్ వేడుకలు

 నిరాడంబరంగా ఈదుల్ అజ్హ బక్రీద్ వేడుకలు
జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు 
వేములవాడ జూలై 21
--త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ వేడుకలను బుధవారం  జిల్లాలోని సిరిసిల్ల,వేములవాడ పట్టణ  లతో పాటు   పలు మండలాల్లో  అలాగే   పలు గ్రామాల్లో ముస్లింలు  నిరాడంబరంగా జరుపుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత ఏడాది కాలంగా మతపరమైన ప్రార్థనలకు ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఉండటంతో ఈద్గాహ్ లు, మస్జిద్ లు వెలవెల బోయాయి. ఈసారి ప్రభుత్వం  అనుమతి ఇవ్వడంతో ఈద్ నమాజ్ ఆచరించడానికి ముస్లింలు పెద్ద ఎత్తున ఈద్గాహ్ లకు, మస్జిద్ లకు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈద్ గాహ్ లు, మస్జిద్ ల వద్ద జన సందోహం కన్పించింది. కరోనా వైరస్ నుండి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్ ను ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. కరోనా వ్యాధిని నశింపజేయలని అల్లాహ్ ను ఆర్థిస్తూ ప్రార్థించారు. వేములవాడ పట్టణంలోని జామే, మహమ్మదీయ ,ఆర్ఫా ,మెయిన్,మదీనా మొహం మధ్య మస్జిద్  లతో పాటు      మున్సిపల్ పరిధిలోని  నాంపల్లి ఇస్లామ్ నగర్ ,రుద్రవరం, శాత్రాజపల్లి ,ఫజల్ నగర్       జామే మస్జిద్ లో మత గురువు మౌల్వీనల బక్రీద్ పండుగ విశిష్టతను, చారిత్రక నేపథ్యాన్నీ వివరించారు. హజ్రత్ సయ్యేదిన ఇబ్రాహీంఅలైసలాం, ఆయన కుమారుడు హజ్రత్ సయ్యేదిన ఇస్మాయిల్ అలైసలాం తండ్రి కొడుకుల త్యాగానికి ప్రతి రూపంగా వేల సంవత్సరాలుగా బక్రీద్ పండుగ ఆచరణలోకి వచ్చిందన్నారు. ఈ త్యాగాల చారిత్రక నేపథ్యంతో ముడి పడిన సందర్భమే ప్రతి యేటా ఈదుల్ అజ్హ బక్రీద్ గా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు పండుగగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. మస్జిద్ లో భౌతిక దూరాన్ని పాటిస్తూ..ఆరు ఎక్కువ తక్బీర్ లతో ఈదుల్ అజ్హా వాజీబ్ నమాజ్ రెండు రకాతులు చదివించి, అనంతరం అరబ్బీ ఖుత్బా పఠించి, ప్రత్యేక దుఆ ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరి నొకరు ఆత్మీయంగా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ నమాజ్ పురస్కరించుకుని ప్రార్థనలు ముగిశాక ఇండ్లళ్లకు వెళ్లి పొట్టేలు, మేకలను అల్లాహ్ పేరు మీద ఖుర్భానీ ఇచ్చారు. ఇట్టి మాంసాన్ని 3భాగాలు చేసి ఒకటి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు,  మరొకటి బీద వారికి, మూడో వంతు ఖుర్భాని ఇచ్చిన వారు వండుకొని భుజించారు. జిల్లాలోని  కోనరావుపేట, బోయినపల్లి , ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట   రుద్రంగి మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో   ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నమాజ్.. దుఆ ప్రార్థనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్  సలీం   కోఆప్షన్ మెంబర్ సర్వర్ అలీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్  మహమ్మద్,జర్నలిస్టులు  ఎం ఏమన్నా న్ ,సయ్యద్  తాహెర్ పా షా,చందుర్తి   అజీమ్ ,  లాయక్ పాషా ,ఆర్.కె. యూసుఫ్ , కలీమ్,రఫిక్, హబీబ్ పాషా,హై మహ్మద్ పాషా,ఖాజా నయిమొద్దీన్ నవాబ్ ఖాన్ ,రసూల్ , సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు  యూసుఫ్,మాజీ అధ్యక్షులు ముస్తఫా,సత్తార్ వేములవాడ మజీద్ కమిటీ అధ్యక్షులు  షేక్ ఇమామ్ సర్వర్, సర్వర్ అలీ,రఫిక్, ముస్లిం యూత్ నాయకులు  షేక్ రియాజ్  ,అక్రమ్,     ఇంతియాజ్ అంజద్ పా షా, రాహుల్ ,ఇబ్రహీం , ఎండి. జమీల్, రజాఖ్,, అజీజ్,  తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts