YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం

భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోన్న భారీ ఆస్ట‌రాయిడ్

భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోన్న భారీ ఆస్ట‌రాయిడ్

భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోన్న భారీ ఆస్ట‌రాయిడ్
వాషింగ్ట‌న్‌ జూలై 21
ఓ భారీ ఆస్ట‌రాయిడ్ భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోందని అమెరిక‌న్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్ల‌డించింది. ఇది ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది. ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్న‌ట్లు పేర్కొంది. ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది. అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

Related Posts