ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలతో పాటుగా ప్రత్యేక హోదా ఇవ్వాలని 5కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ కనకదుర్గమ్మ వారధి వద్ద దండమూడి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని ఆయనప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4సంవత్సరాలుగా ప్రజలను మోసంచేస్తూ వస్తుందని ఇప్పటికన్నా ముందుకు వచ్చి విభజన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలిపారు.
8కిలోమీటర్లు సైకిల్ తొక్కిన మంత్రి
తాడేపల్లి వారధి వద్దనుండి ప్రారంభమైన ర్యాలీ మంగళగిరి బైపాస్ వరకు సుమారు 8కిలోమీటర్లు సాగింది. ప్రత్యేక హోదా నినాదాలతో కార్యకర్తలతో పాటు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంగళగిరి తెదేపా ఇంచార్జ్ గంజి చిరంజీవి, తాడేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి, ఇట్టా పెంచలయ్య, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధక్షులు వల్లభనేని సాయి ప్రసాద్, గుత్తికొండ దనుజయరావ్, నందం అబద్దయ్య, చావాలి ఉల్లయ్య, కొమ్మారెడ్డి కిరణ్, సంకా బాలాజీ గుప్తా, షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.: