YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు ఆదేశాలు

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు ఆదేశాలు

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు ఆదేశాలు
కరీంనగర్
హిందు దేవతల పై విద్వేషపూరిత ప్రతిజ్ఞ లో పాల్గొన్న మాజీ ఐ.పి.ఎస్  అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ  గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరోస్ అధినేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి డా౹౹ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ మెజారిటీ ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞలో పాల్గొన్న సంఘటనలో కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేసారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్. హెచ్. ఓ కు  ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేసారు. గత మార్చ్ నెల 15 న పెద్దపల్లి జిల్లా జూలపెళ్ళి మండలం వడకపూర్ లో వివాదాస్పద ప్రతిజ్ఞ చేసారాయన.

Related Posts