పెగాసస్ ఉదంతంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే దర్యాప్తు చేపట్టాలి
కాంగ్రెస్ నేత కమల్‌నాధ్ డిమాండ్
న్యూఢిల్లీ జూలై 21
పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేత కమల్‌నాధ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కమల్‌నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు.ఈ స్పైవేర్‌ను తాము ఉపయోగించలేదని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతోందని, అయితే సుప్రీంకోర్టుకు ఈ మేరకు అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. పెగాసస్ స్పైవేర్‌తో పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేశారనే ఆరోపణలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.