విషమించిన కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం
లక్నో, జూలై 21,
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థతో చికిత్స జరుగుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. ‘‘కళ్యాణ్‌సింగ్ జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. మంగళవారం సాయంత్రం నుంచి ఆయనను లైఫ్ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచాం.. సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య స్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది’’ అని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 89ఏళ్ల కళ్యాణ్ సింగ్.. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం జులై 4న సంజయ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందజేస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మంగళవారం యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కళ్యాణ్‌సింగ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్‌సింగ్.. ఉత్తర్ ప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు. కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబరు వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసంఘ్, జనతా పార్టీ, బీజేపీల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.