వెనుకబడిన తరగతుల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఐదు ఐదు నెలల గడుస్తున్నా అతి గతి లేదు. వీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసారు. గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియాతో మాట్లాడారు. గత డిసెంబర్ నెలలో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. 200 తీర్మానాలు ప్రతిపాదించారు. వాటి సంగతి ఎమయిందని అయన అన్నారు. 500 బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇంకో నెలలో స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటి వరకు బోధన అధ్యాపకులు లేరు,మౌలిక సదుపాయాలు లేవు. వంద బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52 శాతం మంది బీసీ లు ఉన్నారని తేలింది. బీసీ రుణాలు విషయంలో దరఖాస్తు చేసుకున్న అందరికి రుణాలు తప్పకుండా ఇవ్వాల్సిందే నని అయన అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు అర్హులే కాబట్టి వారందరికీ రుణాలు ఇవ్వాలి. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న,2 లక్షల ఆదాయం వున్న వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. పేదలకు రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని అయన హెచ్చరించారు. బ్యాంకుల్లో అవినీతి బాగా పెరిగిపోయింది. బీసీ లకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. బీసీల్లో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్ మెంట్ ఇచ్చిన మిగతా ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. రిని ఆదుకోవాలి. బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేయాలి. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ పెట్టాలని అయన డిమాండ్ చేసారు.