YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నీటిలోనే సంగమేశ్వరుడు

నీటిలోనే సంగమేశ్వరుడు

కర్నూలు, జూలై 22, 
జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వస్తున్నాయి. దీంతో శ్రీశైలం డ్యామ్ లో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ రేడీఎల్ క్రస్ట్ గేట్లను తాకాయి.నిన్న ఏకంగా ఆరు టీఎంసీలు వరదనీరు చేరింది. మరోవైపు కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంకృష్ణా జలాలు చుట్టేయడంతో.. ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరుతోంది. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వరం ఉంది. ఏకంగా ఇక్కడ ఏడునదులు కలిసే ప్రదేశం. కాబట్టి ఈ ప్రాంతాన్ని సప్తనదుల సంగమం అంటారు. ఏడు నదులు కలిసే చోట ఆలయమే సంగమేశ్వర దేవాలయం ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం ఈ ఆలయం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. భూమిమీద ఎక్కడ.. ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం రాతితో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేపకొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజ చేసుకోవడానికి వేపచెట్టు కొమ్మని ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేసినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆ వేప శివలింగం ఇక్కడ అలాగే ఉంది.కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయానికి భారిగా వరద నీరు చేరుకోవడంతో ఆలయ గర్భాలయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది. మరోపక్క పతిని తాకిని గంగమ్మ పరవశం పొందుతోంది. ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఈ సప్తనదుల సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సతీపతుల సంగమ మనోహర దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తు ఆనందం పొందుతున్నారు.కాగా సంగమేశ్వరుడు ప్రతి ఏడాది ఎనిమిది నెలలు పాటు నీటమునిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంటాడు. జూరాల నుంచి వరద నీరు చేరుతుండడంతో కర్నూల్ జిల్లాలోని చారిత్రిక ఆలయం సప్తనదుల సంగమేశ్వరుడి ఆలయం నీటమునుగుతుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు రావడంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది.

Related Posts