వరంగల్ అర్బన్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు మధ్యాహ్నం అకాల వర్షం, ఈదురు గాలులు వీసాయి.. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పట్టపగలే చీకటి కమ్ముతూ ఉరుము వేరుపులతో భారీ వర్షం. పట్టపగలే ఎలా వాతావరణం మార్పు పై నగర ప్రజలు ఆందోళన చెందారు. వరంగల్ అర్బన్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో వుంచిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి. భారీ వర్షాల మూలంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెట్లు పడిపోతే వెంటనే రోడ్ల పైన పడినచెట్లను తొలగించి, విద్యుత్ పోల్ లు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు జనగాం జిల్లా బచ్చన్నపేట, నర్మెట్ట,తరిగొప్పుల మండలాల్లో కుడా ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ, పిఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడసి ముద్దయింది. దాంతో రైతులు ఆందోళనలో పడ్డారు.