YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజకీయాలకు టీజీ గుడ్ బై

రాజకీయాలకు టీజీ గుడ్ బై

కర్నూలు, జూలై 22, 
కొందరు పదవికే అలంకారం తెస్తారు. మరి కొందరు పదవితోనే హైలట్ అవుతుంటారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కు ఈ రెండు ఖచ్చితంగా సరిపోతాయి. ఆర్థికంగా, సామాజికంగా పార్టీలకు ఆయన అవసరమే ఉటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే టీజీ వెంకటేష్ ఏ పార్టీలో ఉన్నా పదవులు వచ్చి పడతాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంత్రిగా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ పదవిని పొందారు. ఇలా ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న టీజీ వెంకటేష్ బీజేపీలోనే కొనసాగుతారా? మరోసారి పార్టీ మారతారా? అన్న చర్చ జరుగుతోంది.వెంకటేష్ పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. 2022 జూన్ తో టీజీ వెంకటేష్ పదవీ కాలం పూర్తి కానుంది. అంటే మరో పది నెలలు మాత్రమే ఆయన పదవీ కాలం ఉంటుంది. ప్రస్తుతానికి బీజేపీలో ఆయన యాక్టివ్ గానే ఉన్నా రానున్న కాలంలో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన లు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. టీడీపీ పరిస్థితి బాగా లేదు. ఈ మూడు పార్టీలు కలిస్తే సులువగా అధికారంలోకి రావచ్చు. టీజీ వెంకటేష్ ఆలోచన కూడా అదే. అందుకే మూడు పార్టీల పొత్తుతోనే ముందుకు వెళ్లాలని టీజీ వెంకటేష్ ఆలోచన. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.అయితే పొత్తు కుదరకపోతే టీజీ వెంకటేష్ ఏ పార్టీలో ఉంటారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ టీడీపీలోనే ఉన్నారు. ఆయన కర్నూలు టౌన్ టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. తన కంటే తన తనయుడు భరత్ రాజకీయ భవిష్యత్ ముఖ్యంగా టీజీ వెంకటేష్ అడుగులు పడతాయని అంటున్నారు. వైసీపీలోకి వెళ్లినా భరత్ కు భవిష్యత్ ఉండదు. అక్కడ అప్పటికే నేతలు ఉన్నారు. టిక్కెట్ రావడమూ కష్టమే. తెలుగుదేశం పార్టీలోనే ఉండి భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నది టీజీ వెంకటేష్ ఆలోచనగా ఉంది. ఆయన బీజేపీలో ఉన్నా భరత్ ఎదుగుదలకు అండగా ఉంటూ వస్తున్నారు.మరో పది నెలలో రాజ్యసభ పదవీకాలం ముగియగానే పూర్తికాలం టీజీ వెంకటేష్ కర్నూలు టౌన్ నియోజకవర్గంపైనే దృష్టి పెడతారంటున్నారు. పూర్తి సమయం కుమారుడిని ప్రజల్లో హైలెట్ చేసేందుకే వినియోగిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే కర్నూలు నియోజకవర్గంపై తమ కుటుంబం పట్టు సాధించే ప్రయత్నంలోనే టీజీ వెంకటేష్ ఉంటారట. వచ్చే ఏడాదితో టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన రాజకీయంగా కూడా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడంతో ఇక పదవుల వ్యామోహం కూడా ఆయనకు తీరిపోయిందంటున్నారు.

Related Posts