అమరావతి
వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని..మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా..ఉభయగోదావరి. విశాఖ..విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.