ఏపీ సచివాలయంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రెండో బ్లాక్ లో సిలింగ్ ఎగిరిపోయింది. బ్లాక్ ల మెయిన్ ద్వారాల అద్దాలు పగిలిపోకుండా పోలీసులు పట్టుకున్నారు. దట్టమయిన మేఘాలు కమ్ముకోవడంతో సచివాలయ పరిసరాలు చీకటిమయంగా మారాయి. కృష్ణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా జిల్లా అధికారులతో కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం టెలి కాన్ఫెరెన్ నిర్వహించారు. భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున జిల్లాలో హై ఎలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. మండల, రెవిన్యూ, జిల్లా స్థాయి అధికారులు వారివారి కార్యస్థానం కార్యాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అయన అదేశాలిచ్చారు. పశువుల ను సురక్షితప్రాంతాల్లో కి తరలించాలి. విద్యుత్, మునిసిపల్, పంచాయతీ రాజ్ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్తు నిర్వహణకోసం పలు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసామని అయన అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ ...08672- 252847, విజయవాడ క్యాంప్ ఆఫీస్ కంట్రోల్ రూమ్.0866-2474801 సబ్ కలెక్టర్ ఆఫీస్. విజయవాడ 0866- 2576217, ఆర్. డి.ఓ. నూజివీడు..08656-232717, ఆర్.డి.ఓ.గుడివాడ..08674-243697. ఆర్. డి.ఓ బందర్ 08672-252486 నెంబర్లకు సమాచారం అందించవచ్చని అయన అన్నారు.