నంద్యాల
ఫోన్లు హ్యాంకింగ్ ను ఖండిస్తూ ఏఐసీసీ మరియు పీసీసీ పిలుపు మేరకు గురువారం నాడు చేపట్టిన చలో రాజ్ భవన్ ముట్టడికి నంద్యాల పార్లమెంట్ జిల్లా నుండి డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నంద్యాల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు తరలి వెళ్లారు. పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాధ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విజయవాడ కాంగ్రేస్ పార్టీ కార్యలయం నుండి ర్యాలి చేపట్టగా మోడీ డౌన్ డౌన్ అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలతో ర్యాలీ కొనసాగగా మధ్యలోనే పోలీసులు గట్టి బందోబస్తు తో అందరిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించడం జరిగింది. ఈ క్రమం లో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపులాట జరిగింది. పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించగా నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ యాదవ్ , అజిత్ సింగ్ నగర్ నార్త్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. లక్ష్మీనరసింహ యాదవ్ తోపాటు , ఏపీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ లు తులసి రెడ్డి , మస్థాన్ వలి ,మరియు రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి రాజీవ్ రత్నం , మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరుల రాష్ట్ర నాయకులను మరియు నంద్యాల పార్లమెంట్ జిల్లా నిర్వాహణ కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, జిల్లా కార్యదర్శి జనార్దన్ యాదవ్, యూత్ కాంగ్రెస్ విజయ్ యాదవ్, రాజశేఖర్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సంధర్బంగా జె.లక్ష్మీనరసింహ యాదవ్ మాట్లాడుతూ బిజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ని ఎదురుకోలేక చాలా చీప్ ట్రిక్స్ తో కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల ఫోన్ నంబర్ల ను ట్యాపింగ్ చేస్తున్నారని ఇంత చేతకాని ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు,ప్రజా క్షేత్రం లో నీతిగా న్యాయం గా ఉండాలి గాని అధికారం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏంటని ప్రశ్నించారు. ప్రముఖుల సందేశాలకే భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని తెలిపారు, ఫోన్ ట్యాపింగ్ లకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ లను సుప్రీమ్ కోర్ట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.