YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

21 వ డివిజన్ లో కోటి 90 లక్షల తో అభివృద్ధి పనులకు శ్రీకారం

21 వ డివిజన్ లో కోటి 90 లక్షల తో అభివృద్ధి పనులకు శ్రీకారం

21 వ డివిజన్ లో కోటి 90 లక్షల తో అభివృద్ధి పనులకు శ్రీకారం
 నెల్లూరు
 నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, స్నేహా నగర్ జంక్షన్లో 1 కోటి 90 లక్షల రూపాయల వ్యయంతో బి.టి. రోడ్లు మరియు సీసీ రోడ్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , ఏఎంసి ఛైర్మెన్ యేసు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 21వ డివిజన్లో ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని ఆకాంక్షించారు. ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జ్ మరియు యు.ఎస్ తానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts