YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 24 వతేది కావలిలో ప్రారంభ , శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రులు

ఈ నెల 24 వతేది కావలిలో ప్రారంభ , శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రులు

ఈ నెల 24 వతేది కావలిలో ప్రారంభ , శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రులు
నెల్లూరు
ఈ నెల 24 వతేది పంచాయితీ రాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ పర్యావరణం శాఖామాత్యులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, జలవనరుల శాఖామాత్యులు పీ. అనీల్ కుమార్ యాదవ్ ,పరిశ్రమలు , వాణిజ్య శాఖామాత్యులు మేకపాటి గౌతమరెడ్డి కావలికి రానున్నారు . జరిగిన , జరగబోతున్న పలు అభివృద్ధి పనులకు వారు ప్రారంభోత్సవాలు , శంఖుస్థాపనలు చేస్తారు . 24 వతేదీ ఉదయం 9 గంటలకు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి నివాసానికి మంత్రులు వస్తారు . శాసనసభ్యుల ఆతిధ్యాన్ని స్వీకరించిన అనంతరం వైస్సార్సీపీ నాయకుల , కార్యకర్తల బైక్ ర్యాలీ తో కలిసి వెళ్లి మంత్రులు మండలప్రజాపరిషత్ వెనుక 85 లక్షల వ్యయంతో నిర్మించిన  డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్  భవనాన్ని ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభిస్తారు . వ్యవసాయ శాఖ , మత్స్యశాఖ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది . అనంతరం 9 గంటల 50 నిమిషాలకు పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో  ఆముదాలదిన్నె లో జగనన్న పచ్చతోరణం పథకం క్రింద చెట్లు నాటే కార్యక్రమం వుంటుంది .10 గంటలకు ఆముదాలదిన్నె లో పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్ మంత్రులు ప్రారంభిస్తారు . అక్కడనుండి తాళ్లపాలెం వెళ్లి 10 గంటల 30 నిమిషాలకు పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 45 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనం  కు ప్రారంభోత్సవం చేస్తారు . 10 గంటల 40 నిమిషాలకు తాళ్లపాలెంలో ఉపాధి కూలీలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది .  అక్కడనుండి బయలుదేరి తుమ్మలపెంట సెంటర్ వద్దకు వెళతారు . 11 గంటల 10 నిమిషాలకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో  64 కోట్ల వ్యయంతో నిర్మించే కావలి నియోజకవర్గానికి సంబంధించిన 240 గ్రామాలకు త్రాగునీరు సరఫారాచేసే  జలజీవన్ మిషన్  పైలాన్ ను  మంత్రులు ఆవిష్కరిస్తారు . అనంతరం 11గంటల 20 నిమిషాలకు తుమ్మలపెంట సెంటర్ లోనే పంచాయితీరాజ్ శాఖ 10 కోట్లతో నిర్మించబోయే రోడ్డు కు ( ప్రకాశం జిల్లా బార్డర్ నుండి అన్నగారిపాలెం పంచాయితీ పరిధిలోని లక్ష్మీపురం వరకు )  శంఖుస్థాపన చేస్తారు . 11గంటల 30 నిమిషాలకు వై ఎస్ ఆర్ క్రాంతి పథకం తుమ్మలపెంట సెంటర్ సమీపంలో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసే బహిరంగసభ లో మంత్రులు పాల్గొని ప్రసంగిస్తారు  . ఆతర్వాత భోజన విరామంలో అందరూ కావలి వచ్చి శాసనసభ్యులు ప్రతాపకుమార్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసే విందు కు హాజరవుతారు . తదుపరి బట్లదిన్నె గ్రామం చేరుకుంటారు . 1 గంట 30 నిమిషాలకు 2 . 6 కోట్లతో పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే బట్లదిన్నె రోడ్డు కు శంఖుస్థాపన చేస్తారు . అక్కడ నుండి దగదర్తి చేరుకుంటారు . జలవనరుల శాఖ 28 కోట్లతో చేపట్టిన దగదర్తి - రాచర్లపాడు సప్లై ఛానెల్ నిర్మాణం పనులకు 2 గంటల15 నిమిషాలకు శంఖుస్థాపన చేస్తారు . 2 గంటల 30 నిమిషాలకు చెన్నూరు వెళ్లి అక్కడ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 21 కోట్లతో నిర్మించబోయే దగదర్తి - బుచ్చి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేస్తారు . చెన్నూరులో 2 గంటల 40 నిమిషాలకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుభరోసా కేంద్రం ను ప్రారంభిస్తారు . దాంతో కావలి నియోజకవర్గంలో మంత్రుల పర్యటన ముగిసిపోతుంది .

Related Posts