YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కార్యకర్తల కోసం జగన్

కార్యకర్తల కోసం జగన్

విజయవాడ, జూలై 23, 
వైసీపీ అధినేత జగన్ శ్రమించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దీనిని మరోసారి సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. తొలి రెండేళ్లు సంక్షేమ కార్యక్రమాలకే సమయం కేటాయించిన జగన్ ఇప్పుడు పార్టీపై నజర్ పెడుతున్నారు. రానున్న కాలంలో వరసగా పార్టీ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కనీసం వారానికి ఒక సారి పార్టీ కార్యక్రమాలను నిర్వహించేలా ప్లాన్ చేయాలని జగన్ సీనియర్ నేతలకు ఆదేశించినట్లు తెలిసింది.ఏ పార్టీ విజయం సాధించాలన్నా అందుకు కార్యకర్త ముఖ్యం. కార్యకర్తలు అసంతృప్తికి గురయితే ఆ పార్టీ విజయావకాశాలు యాభైశాతం తగ్గినట్లే. ఈ సూత్రం ఏరాజకీయ పార్టీకయినా వర్తిస్తుంది. అందులో అధికారంలో ఉండే పార్టీకి ఈ అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండేళ్ల నుంచి కరోనా కారణం కావచ్చు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం కావచ్చు. జగన్ పార్టీ క్యాడర్ పై దృష్టి సారించలేదు.ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల వద్దకు చేర్చేది కార్యకర్తే. అందుకోసమే జగన్ దీనిపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకున్నట్లు తెలిసింది. ముఖ్యమైన కార్యకర్తల జాబితాలను నియోజకవర్గాలుగా రూపొందించాలని, కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ప్రయోజనం చేకూర్చాలని ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు.దీనికి తోడు జగన్ కూడా నేరుగా కార్యకర్తలతో సమావేశమయ్యేలా కూడా కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉండటంతో ప్రతి నియోజకవర్గం కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యేలా ప్రణాళిక రూపొందించాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ముఖ్యమైన కార్యకర్త ఏదో రకంగా ప్రయోజనం పొందేలా చూడాలన్నది జగన్ ఆలోచన. మొత్తం మీద జగన్ రెండేళ్ల తర్వాత క్యాడర్ పై దృష్టి పెట్టినందుకు కిందిస్థాయి నేతల్లోనూ సంతోషం వ్యక్త మవుతోంది

Related Posts