YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బొత్సకు తప్పని ఇంటి పోరు

బొత్సకు తప్పని ఇంటి పోరు

విజయనగరం, జూలై 23, 
పార్టీ ఏదైనా కానీ విజయయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణకు హవాకు ఇప్పటిదాకా తిరుగులేదు. దశాబ్దాలుగా ఆయన జిల్లాలో తన పట్టుకుని ఆలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనూ బొత్సతో విభేదించిన వారు కూడా సైడ్ అయిపోయారు తప్ప ఎదిరించి మనలేకపోయారు. ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. బొత్స సత్యనారాయణ కీలకమైన మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యేలను ఒకే తాటి మీద నడిపిస్తున్నారు అన్న మాట అయితే ఉంది. అయితే ఇందులో ఇపుడు తిరుగుబాటు స్వరం వినిపించడం మాత్రం ఆశ్చర్యకరేమే కాదు, బొత్స సత్యనారాయణకు షాక్ లాంటి పరిణామమే.విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తాజాగా జరిగిన అభివృద్ధి పై సమీక్షా సమావేశంలో ఏకంగా సభలోనే మంత్రి బొత్స సత్యనారాయణని నిలదీశారు. తన నియోజకవర్గంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల మీద కూడా ఆయన విమర్శలు చేశారు. అవి ఇల్లు కట్టుకునేందుకు సరైన ఆవాస యోగ్యం కావని కూడా కామెంట్స్ చేశారు. దీని మీద బొత్స సత్యనారాయణ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కూడా అలజంగి అలా రెచ్చిపోవడం బట్టి చూస్తే ఆయన బొత్స సత్యనారాయణ మీద కావాలనే విమర్శలు చేయాలని అనుకుంటున్నారని తెలిసిపోతోందని అంటున్నారు.నిజానికి అలజంగి జోగారావు కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరో వైపు ప్రసన్న కుమార్ కి ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన విధేయుడిగా వైసీపీకి ఉంటూ వచ్చారు. కానీ బొత్స సత్యనారాయణ అలజంగిని కాంగ్రెస్ లోకి రప్పించి ఎన్నికల ముందు టికెట్ ఇప్పించారు. అంతే కాదు ఎమ్మెల్యేను చేశారు. ఇపుడు అదే అలజంగి రివర్స్ అవడం బొత్స క్యాంప్ తట్టుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్యే మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరో వైపు ప్రతీ దానికీ బొత్స క్యాంప్ తన మీద పెత్తనం చేయడాన్ని కూడా ఆయన సహించలేకపోతున్నారని దాంతోనే ఇలా రివర్స్ అయ్యారని టాక్.విజయనగరం జిల్లా విషయంలో బొత్స సత్యనారాయణను బహిరంగంగా కాదని రాజకీయం చేయడం కుదిరే పని కాదు, సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి కూడా బొత్స సత్యనారాయణ కలిసే ఉంటూ తన రాజకీయం తాను చేసుకుంటారు. ఇపుడు అలజంగి ఇలా చేయడం అంటే ఆయన ఒక్కరేనా, వెనక ఎవరు ఉన్నారు అన్న దాని మీద బొత్స శిబిరం ఆరా తీస్తోంది. మరో వైపు మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే బొత్స సత్యనారాయణను తప్పిస్తారు అన్న ప్రచారం కూడా రావడంతో ఆయన మీద ఈజీగా నాయకులు తిరిగుబాటు స్వరం వినిపిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే మెజారిటీ బొత్స గూట్లో ఇప్పటిదాకా ఉండేవారు. ఇపుడు మెల్లగా బొత్స శిబిరం బలహీనపడుతోంది అంటున్నారు. మరిది ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది అన్నదే చూడాలి.

Related Posts