YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో పెరగనున్న బీరు ధరలు ధరలు పెంచాలని రేట్ కాంట్రాక్ట్ కమిటీ సిఫారసు

తెలంగాణలో పెరగనున్న బీరు ధరలు        ధరలు పెంచాలని రేట్ కాంట్రాక్ట్ కమిటీ సిఫారసు

తెలంగాణలో త్వరలో బీరు ధరలు పెరుగనున్నాయి.  బీరు ధరలను 9 నుంచి 10 శాతం మేర పెంచాలంటూ 'రేట్ కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీ' సిఫారసు చేసింది. లైట్ (లాగర్) బీరు పై 9 శాతం, స్ట్రాంగ్ బీరుపై 10 శాతం పెంచాలని సూచించింది. బేసిక్ ధరను పెంచాలంటూ బ్రూవరీ కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరను నిర్ణయించేందుకు రేట్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్ట్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్, చార్టెర్డ్ అకౌంటెంట్ తో కూడిన ఈ త్రిసభ్య కమిటీ... బ్రూవరీ కంపెనీల నుంచి విన్నపాలను స్వీకరించింది. ఎంతమేరకు బేస్ ప్రైజ్ ను పెంచవచ్చనే విషయంపై చర్చించింది. ఈ సందర్భంగా కొన్ని కంపెనీలు 12 శాతం, మరి కొన్ని కంపెనీలు 15 శాతం పెంచాలంటూ కోరాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కమిటీ... చివరకు 9, 10 శాతం పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది.

ప్రస్తుతం ఈ సిఫారసులు ఎక్సైజ్ కమిషనరేట్ కు చేరాయి. దీనికి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. అనంతరం ఈ ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళుతుంది. సీఎం కేసీఆర్ సంతకం చేయగానే బీరు ధరలు పెరుగుతాయి.

Related Posts