విశాఖపట్నం
వాయవ్య బంగాళాఖాతము దాని పరిసరాల పై అల్పపీడనం కొనసాగుతోంది. దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశలో ఎత్తుతో వంగి ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో శుక్రవారం తో శనివారం ఉరుములు, మెరుపులు తోపాటు ఒక మోస్తరు భారీ నుంచి అతి భారీ వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఏపీ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశము జిల్లాల లో కురిసే అవకాశం ఉంది . భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో కురిసే అవకాశం ఉంది. రాయలసీమ లో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కడప, కర్నూలు జిల్లాల లో కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు ఈనెల 26 వరకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసారు.