YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్కింగ్ కోసం గ్రీన్ బెల్ట్ ను తవ్వేసారు

పార్కింగ్ కోసం గ్రీన్ బెల్ట్ ను తవ్వేసారు

విశాఖపట్నం
మేయర్ కారు పార్కింగ్ కోసం గ్రీన్ బెల్ట్ లో జివిఎంసీ అధికారులు. పచ్చని చెట్లు కొట్టేవేయడం వివాదస్పదవుతోంది. ఇప్పటికే 150 మీటర్ల పొడవున తవ్వకాలు జరిపారు. పెదగలిలో నివాసం ఉంటున్న మేయర్ గొలగాని హరి వెంకట కుమారి,  తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. మేయర్ నివాసానికి సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డుకు, సర్వీస్ రోడ్డుకు మధ్యలో 10 మీటర్లు వెడల్పున గ్రీన్ బెల్ట్ వుంది. ఆ ప్రాంతాన్నే వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని   మేయర్ కుటుంబం కోరారు. దానికి  వెనకాముందూ ఆలోచించకుండా అధికారులు 150 మీటర్ల పొడవున గ్రీన్ బెల్ట్ ను జేసీబీలతో తవ్వేసి  లెవెల్ చేసారు. మేయర్ క్యాంపు కార్యాలయం కు వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా వున్నందున గ్రీన్ బెల్ట్ ను కొంచెం మార్పులు, చేర్పులు చేశారని  మేయర్ అంటున్నారు. అయితే, గ్రీన్ బెల్ట్ తోలగింపు పైల్ తన వద్దకు రాలేదన్న మునిసిపల్  కమీషనర్ సృజన అంటున్నారు.

Related Posts