YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భూకబ్జాలు కనిపించడంలేదా ?

భూకబ్జాలు కనిపించడంలేదా ?

పీలేరు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను ప్రశ్నించే వరకు పీలేరులో భూకబ్జాలు కాన రాలేదా?  పీలేరులో భూ కబ్జాలపై పర్వం గురించి ఇటీవల నేను ప్రశ్నించే వరకు ఇటు అధికారులకు గాని అటు నాయకులకు గాని కానరాలేదా లేదా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 సంవత్సరంలో సాక్షి పత్రికలో ప్రచురితమైన శ్రీనాధుడి భూ లీలలు అనే కథనం గురించి చూపుతూ, పీలేరు పట్టణంలో 1111 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో అలాంటి వారికే పదవులు కట్టబెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారు అని కిషోర్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.2004 నుండి 2009 మధ్య కాలంలో పీలేరు శాసనసభ్యులుగా ఉన్న  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలోనూ, అటుపిమ్మట నల్లారి కిరణ్  కుమార్ రెడ్డి హయాంలోనూ భూకబ్జాలు పెద్దగా జరగలేదని అన్నారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాల పర్వం గురించి అధికారులకు తెలియదా అన్నారు.
 పెద్దిరెడ్డి మరియు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లా హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి తాసిల్దార్ లు గా వ్యవహరించిన లవన్న రేణుక, ఖాదర్ షరీఫ్ లను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.   ప్రస్తుతం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా అధికారులపై గాని భూకబ్జాలకు పాల్పడ్డ నాయకులపై కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు.   పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లె పంచాయతీ పరిధిలో ఒక ఎకరా పట్టా భూమి ఉండగా దానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజరు భూమిని చదును చేసి లే అవుట్ లు వేసి విక్రయించిన  విషయాన్ని సైతం వెల్లడించినప్పటికీ చర్యలు శూన్యమన్నారు

Related Posts