విశాఖపట్నం
ఆంద్రా యూనివర్సిటీ విశ్రాంత టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు ఎనిమిది కోట్లు రూపాయలు బకాయిలు తక్షణమే చెల్లించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటీశ్వర రావు డిమాండ్ చేశారు. విశాఖ సిఐటియూ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీని రాజకీయ పార్టీ అడ్డాగా మార్చేశారని ,ప్రశ్నిస్తే భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రా యూనివర్సిటీ కి చెందిన వేల కోట్లు విలవ చేసే భూములు వివరాలు సేకరిస్తున్నారని వివరించారు. ఏయూ లో జరిగే అన్యాయాలపై విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి లేదన్నారు. దీనిలో భాగంగానే వీసీ కార్యాలయం వద్ద అంచెల భద్రత ఏర్పాటు చేశారన్నారు.గతంలో వలే యూనివర్సిటీ లోకి యధేచ్ఛగా వెళ్లే పరిస్థితులు లేవని వాపోయారు.