YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి జగదీష్ రెడ్డి

రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి జగదీష్ రెడ్డి

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబందు పధకం పై రైతులలో అవగహాన కలిగించేందుకు గాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తన్న అవగహనా సదస్సులు రెండో రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి.  మొత్తం తెలంగాణా రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గ కేంద్రంలో గ్రామస్థాయి రైతు సమన్వయ కమిటి సభ్యులతో ప్రారంభమైన అవగహానా సదస్సులు రెండో రోజు సూర్యాపేట జిల్లాలోను కొనసాగాయి. రాష్ట్ర విద్యుత్, యస్.సి.అబివృద్ధి శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సూర్యాపేట నియోజక వర్గంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలలో రైతు బందు పధకం పై అవగహన సదస్సులు హూజుర్ నగర్ , కోదాడ లలో నిర్వహించారు.   గురువారం ఉదయం తుంగతుర్తి నియోజక వర్గం పరిధిలోని నాగారం మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు గాదరి కిశోర్ కుమా ర్ అధ్యక్షతన జరిగిన రైతుబంధు అవగహాన సదస్సుకు ముఖ్య అథిధులు గా మంత్రి  జగదీష్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  భవిష్యత్ లో గిట్టు బాటు ధర నిర్ణయించేది రైతులే. పోలాల మధ్యనే రైతు వేదికల నిర్మాణాలుంటాయని అన్నారు.  భూరికార్డుల ప్రక్షాళన అందులో భాగమే. ఈ విషయంలో అధికారుల పనితీరు ప్రశంశనీయమని అన్నారు. తెలంగాణాలో ఇకపై టేల్-ఎండ్ అన్న పదం వినిపించొద్దు. పేరు కోసం కాదు రైతుల ప్రయోజనం కోసమే నని అన్నారు. పదవుల కోసం ఆంధ్రోళ్ళకు  సంచులు మోసిన నేతలు వారు # టేల్-ఎండ్ పేరిట ఎడమకాలువ చివరి భూములకు నీరందించ లేక పోయారు. #ముఖ్యమంత్రి కేసీఆర్   పాలనలో మేజర్లకు రెండోపంటకు నీరు వచ్చిందని అన్నారు. 

Related Posts