పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
డోన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సచివాలయ సెక్రటరీ మల్లయ్య,హెల్త్ సెక్రటరీ మహేశ్వరి అన్నారు, స్థానిక డోన్ పట్టణంలో సుందర్ సింగ్ కాలనీ యందు శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆ ఇంటిని సందర్శిచి ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని, ఇంటి చుట్టుపక్కల లో నీరు నిల్వ ఉండకూడదు అని, పాత టైర్లు, ఉపయోగయించనివి ప్లాస్టిక్ వస్తువులు, పాత తొట్లులలో నీరును నిల్వ ఉంచరాదని, అలాగే మల మూత్ర విసర్జన కోసం మరుగుదొడ్లును ఉపయోగించాలినీ,ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యంతో బాధపడుతూ వుంటారు, కావున తప్పనిసరిగా ఈ వర్షం కారణంగా నిల్వ ఉంచిన నీటి ని వెంటనే తొలగించేటట్లు చర్యలు తీసుకోవాలని విజైప్తి చేశారు, ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ సచివాలయం సెక్రటరీ, వార్డ్ సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు