YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ మాగుంట కుమారుడి కోసం ప్రయత్నాలు

ఎంపీ మాగుంట కుమారుడి కోసం ప్రయత్నాలు

ఒంగోలు, జూలై 24, 
వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్‌ ఓ రేంజ్‌లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్‌. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్‌లో వారసులకు ఓనమాలు దిద్దిస్తారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారట. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల ద్వారా తెరమీదకు తెచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎంపీగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో కాకుండా.. కుమారుడి కోసం ఇంకో స్థానాన్ని ఎంపిక చేసుకోవడంతో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు కాంగ్రెస్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. జనంలో క్రేజ్ ఉన్నప్పుడే వారసుడు రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని గిద్దలూరు అసెంబ్లీలో తరచుగా చక్కర్లు కొట్టిస్తున్నారట. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో మాగుంటకి భారీ మెజారిటీ రావడం.. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన గిద్దలూరుపై కన్నేశారని వైసీపీలో టాక్. దీంతో మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఏదో ఒక కార్యక్రమం పేరుతో గిద్దలూరులో తరచుగా పర్యటిస్తున్నారట.గిద్దలూరులో వైసీపీ నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా సొంత పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నచోట.. రాంబాబుకు చెప్పకుండానే రాఘవరెడ్డి పర్యటనలు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. కుమారుడి కోసం నియోజకవర్గంలో సొంతంగా ఒక వర్గాన్ని మాగుంట సిద్ధం చేశారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాచుపాములా బుస కొడుతున్నారట ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎంపీ తనయుడు పర్యటనలకు వెళ్లొద్దని.. అనుచరులకు, అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారట ఎమ్మెల్యే. వైసీపీ ముఖ్య నేతలకు కూడా గిద్దలూరులో ఎంపీ మాగుంట చేస్తున్న పాలిటిక్స్‌పై రాంబాబు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.గిద్దలూరులో ప్రస్తుతం వైసీపీ రాజకీయాలు ఎంపీ మాగుంట వర్సెస్‌ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నట్టుగా మారాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయికి వెళ్తుందో.. ఎటు దారితీస్తుందో తెలియక కేడర్‌ ఆందోళన చెందుతుందట. రెండు వర్గాల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా ఉంది. ఇద్దరూ బలమైన నాయకులే కావడంతో వారి వర్గాలు సైతం వెనక్కి తగ్గేలా లేవు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.. ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

Related Posts