వనపర్తి
తెలంగాణ రాష్ట్రం పంటలతో పచ్చబడిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వనపర్తి చందాపూర్ అటవీప్రాంతంలో మంత్రి మొక్కలు నాటి, కేక్ కట్ చేసారు. మంత్రి మాట్లాడుతూ హరితహారం మొక్కలను ఇంట్లో పిల్లలను పెంచినట్లు పెంచుకోవాలి. పచ్చదనం ప్రాముఖ్యత ఈ కాలం ప్రజలు, యువత గుర్తిస్తున్నారు. భావితరాలకు స్వచ్చమైన గాలి, పర్యావరణం అందించడం ఈ తరం బాధ్యత. ఆరోగ్య వంతమయిన సమాజాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. ప్రభుత్వ స్ఫూర్థితో వివిధ సంఘాలు, సంస్థలు స్వయంగా హరితహారం నిర్వహిస్తున్నాయి. పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా భారీ ఎత్తున మొక్కలు పెంచడం అభినందనీయం.